పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

66

వరాహపురాణము

హిరణ్యాక్షుఁడు వసుంధర నుత్పాటించి సముద్రమున వైచుట

క.

సురగిరిఁ జేరిన దివిజుల | హరియింపఁ దలంచి, దానవాధీశ్వరుఁ [1]డు
ద్ధురలీల నార్చె, నాశా | కరికర్ణపుటికుడుంగకంబులు వగులన్.

196


వ.

ఇ ట్లట్టహాసంబు చేసి, హిరణ్యాక్షుండు సకలదేవతానాశ[2]కరణాపేక్షుండై యాక్ష
ణంబ.

197


చ.

నిరుపమ[3]హుంకృతిధ్వనులు [4]నింగికిఁ బర్వ, నఖర్వకోపవి
స్ఫురణకరాళనేత్రుఁ డగుచున్, భయ మింతయు లేక, మేరుభూ
ధరసహితంబు గాఁగ వసుధాతల ముద్ధతిఁ బెల్లగించి, సా
గరమున వైచె బాహుబలగర్వ మెలర్పఁగ, నిట్లు వైచినన్.

198


క.

సాధ్వసమున దివిజులు హా | హా! ధ్వని యొనరించి, రమ్మహాబ్ధియుఁ దత్పా
తధ్వస్తజలచరంబై | సధ్వానం బగుచుఁ గలఁగి చలితం బయ్యెన్.

199


క.

వడి చెడక తద్వసుంధర | బుడబుడమని కడలినడుమ [5]బుగ్గలు [6]వొడమన్
బడి, మునుఁగునపుడు జగములు | వడవడ వడఁకంగఁ దొడఁగె [7]వసుధామర్త్యా!

200


ఆ.

అంత, నాక్షణం[8]బ యఖిలజగత్పాలనక్రియాపరుండు చక్రధరుఁడు,
జలధిమగ్నసర్వసర్వంసహాతలో | ద్ధరణమునకు నాత్మ దయ దలిర్ప.

201


యజ్ఞవరాహావిర్భావము

సీ.

ఆమ్నాయములు చరణారవిందములుగా, | రవిసుధాకరులు నేత్రములు గాఁగ,
గంధవాహస్ఫూర్తి కర్ణయుగ్మంబుగా, | శివపద్మభవులు దంష్ట్రికలు గాఁగ,
నుగ్రానలంబు ఘోణాగ్రభాగంబుగా, | జలధరంబులు సటాచ్ఛటలు గాఁగఁ,
గాకోదరేంద్రుండు కఠినవాలంబుగాఁ, | గాలంబు గమనవేగంబు గాఁగ,


తే.

యజ్ఞరూపంబుతోడ బ్రహ్మాండమెల్లఁ | దానయై నిండి, సుర లద్భుతంబు నొంద,
........ డిందిరాప్రాణవిభుఁడు, | రాక్షసధ్వంసి, యాదివరాహ మయ్యె.

202


వ.

.........డేయునకు రోమశుం డెరింగించినయత్తెఱంగు.

203
  1. {గ్రంథపాతం}
  2. కరుణాపేతుండై - క
  3. హీంకృతి
  4. {గ్రంథపాతం}
  5. బుడగలు - అని యుండిన ననుప్రాసశోభ యతిశయించును
  6. {గ్రంథపాతం}
  7. వసుధామాత్యా - మ,మా
  8. బునందు - మ,తా,తి,తీ,ర,హ,క