పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

65

దేవదానవద్వితీయమహాసంగ్రామము

వ.

ఆ సమయంబున మహేంద్రాదిబృందారకబృందంబు నాకలోకవిహారులగు దైత్య
వీరులతోడి యుద్ధంబునకు సన్నద్ధంబై వచ్చినం, బెచ్చు పెరిగి, హిరణ్యాక్షప్రేరితులై జ్వాలా
ముఖ కేతుముఖ రుచిక చిత్రకేతు ధూమ్రాక్ష కరాళాక్ష వజ్రదంత సూచీదంత వికట తామ్ర
కేశ దక్షిణావర్త శంబ గవయాది రాత్రించరవరులు హస్త్యశ్వరథపదాతిసమేతులై, శాత
బాణసంపాతంబున నొప్పించె. అంత, గీర్వాణబలంబు చలంబునం [1]బోక పెనంగినం, బతిత
కరివ్యూహంబును, భగ్నాశ్వసందోహంబును, గళితశతాంగంబును, ఖండితవీరభటోత్త
మాంగంబును, నృత్యత్కబంధశతసంకీర్ణంబును, రక్తప్రవాహపూర్ణంబును, మేదో
మాంసపంకిలంబును, శోణితపానమత్తభూతబేతాళసంకులంబును, గాహళమృదంగ
భేరీభయదఘోషణంబును, సర్వలోకైకభీషణంబునై యాయోధనం బద్భుతంబయ్యె.
అందు.

191


ఆ.

దివిజవరులతోడి తీవ్రయుద్ధంబున | విఱిగి దైత్యవరులు విహ్వలించి,
యమరపురికి నరిగి యత్తెఱుఁ గెఱిఁగింప, | నసురవరుఁడు శక్తిహస్తుఁ డగుచు.

192


సీ.

[2]చిటచిటాయితకోపశిఖిశిఖాఘటనల | దంష్ట్రాయుగము ఘోరతరము గాఁగ,
నాసా[3]పుటోగ్రనిశ్శ్వాసమారుతమునఁ | గోరమీసమ్ములు [4]గొకురుపొడువ,
భ్రుకుటీవినిర్మాణవికృతపక్ష్మంబులఁ | దీర్ఘనేత్రంబులు దిరుగువడఁగ,
నఖిలలోకభయంకరాట్టహాసంబున | బ్రహ్మాండభాండకర్పరము వగులఁ,


తే.

బాదఘట్టననదులు - భగ్నములుగఁ, | గాయదీప్తుల దిశలు చీఁకట్లు గొనఁగ,
యుద్ధమున కేఁగె [5]సర్వసన్నద్ధుఁ డగుచుఁ | జటులవిస్ఫూర్తి దానవచక్రవర్తి.

193


చ.

మృగపతి సింధురంబుల నమేయ నఖాహతి సంహరించిన
ట్లగణిత బాహుదర్పసముదంచితుఁడై, సురరాజు గుండియల్
వగులఁగఁ, జక్రకుంతశరపట్టిసశూలముఖాయుధంబులం
దెగి వధియించె, దైత్యులు నుతింప నకంపితలీల నత్తరిన్.

194


చ.

అమరులు తన్మహారణమునందు, సువర్ణవిలోచనప్రతా
పమునకు నోర్వలేక, మదిఁ బాయనిభీతిఁ గలంగి, యాత్మవి
క్రమములు వీటిఁబోఁబఱచి, కాంచనభూధరరాజ[6]తుంగశృం
గము తుదఁ జేరి నిల్చిరి, యఖండతదీయవనాంతరంబునన్.

195
  1. బోర - త
  2. చిటపటాయిత - తి; చిటగిటాయిత - హ,ర
  3. పుటాగ్ర - మా,త
  4. గొగురు - తీ; గొరుకు - తా,హ; కుకురు - త
  5. గర్వ - మ,త,తి,తీ,ర,క
  6. భవ్యశృంగ - తీ; శృంగము ల్తుమురుగఁజేరి (యతి?) - హ