పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

63

అమరుల పలాయనము

ఉ.

భీకరదైత్యరాజశరబృందముచేఁ గడు నొచ్చి, నిల్వఁగా
లేక, సురేశ్వరుండు సనిలింపముగా భయవిహ్వలాత్ముఁడై
నాకము నిర్గమించి, శరణంబుగఁ జేరె, నఖండితప్రభా
ప్రాకటచండభానువుఁ, [1]బ్రభానుకృశానువు, రత్నసానువున్.

176


ఆసురపతి యమరలోకాధిపత్యము

వ.

ఇట్లు, వారలు సమరవిముఖులై పఱచిన, నసురచక్రవర్తి నిరమిత్రలోకంబగు నాకంబు
[2]విచ్చలవిడి చొచ్చి, సంతత[3]చింతామణీరామణీయక[4]పరివృతేందిరంబగు సభామంది
రంబున, మహేంద్రసింహాసనంబున సమాసీనుండై, యనర్గళస్వర్గభోగంబుల ననురాగం
బొందుచున్నయెడ, నొక్కనాఁడు [5]భసితసంభవుం డగు సునాసీరుం డను నిశాచరవీరుండు
తత్సమ్ముఖమ్మున నిలిచి యిట్లనియె.

177


సునాసీరదానవుని రాజనీతిప్రబోధము

ఉ.

నీవు భుజావిజృంభణవినిర్జితనిర్జరవల్లభుండవై
దేవ! మహానుభావమున దివ్యపురీమణిసౌధకామినీ
భావజకేళిఁ దేలుచు, నభంగపరాక్రమశక్రరాజ్యల
క్ష్మీవిభవాదికృత్యమున మించితి వెంతయు దైత్యనాయకా!

178


క.

దైతేయసార్వభౌమ! మ | హీతలమున నిన్నుఁ బోలు నీదృగ్బలవి
ఖ్యాతుల నెవ్వరిఁ గానము | [6]భూతభవద్భావికాలముల నెయ్యెడలన్.

179


తే.

ఏకతంబైన దిచ్చట హేమనయన! | విన్నవింపంగఁ గల దొక్కవిన్నమాట,
సావధానుండవై విను [7]మస్మదీరి | తంబు, నీకు హితంబు తథ్యంబు నగుట.

180


ఉ.

కొందఱు దానవేశ్వరులు కుంభినిలో మును శూరతాలతా
కందము లయ్యు, నీతి[8]గతిఁ గానమి, [9]భోగవశాంతరంగులై
ముందఱికార్యముల్ [10]విఱగి మోచినదాఁక నెఱుంగలేక, తా
మెందుకుఁగాక రాజ్యధనహీనతఁ బొందిరి [11]రాక్షసాగ్రణీ!

181
  1. బ్రభావ - మా,త
  2. విచ్చనవిడి - మ,మా,త,తా,తి,తీ,ర,క
  3. చింతామణ్యాది పరివృతేందిందిరం - తీ
  4. పరికృతేందిరం - మా,త
  5. భసితత్రిపుండ్రసంభవుం - క
  6. భూతలమున భావికాల - క
  7. మీవు నామతంబు - హ; సతతంబు నీకు - ర; మస్మదీయహితము - క
  8. రతి - త
  9. క్రూరదశాంత - తీ
  10. పెరిగి - త
  11. రాక్షసాధమా - తీ