పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

61


క.

దానవు లప్పుడు నిర్జర | సేనాసంరంభమునకుఁ జిత్తంబునఁ గ్రో
ధానలము ప్రజ్వలించిన | నానిర్జరబలముఁ దాఁకి రతిరభసమునన్.

162


క.

ఉభయబలంబులశూరులు | నభిముఖులై యిట్లు పోరి రన్యోన్యజయా
[1]రభటి మనంబులఁ గోరుచు | నభినవదోర్దండశౌర్య మతిశయ మందన్.

163


వ.

తత్సమయంబున నిరువాఁగునుం గలయం బెరసి, గజారోహకులు గజారోహకులును, దుర
గారూఢులు తురగారూఢులును, రథికులు రథికులును, బదాతులు పదాతులును దలపడి,
తుండంబులు ఖండించియు, రదనంబులు విదళించియు, శిరంబులు నురుమాడియుఁ, బాదం
బులు ఛేదించియు, [2]మావతుల నిర్జీవితులం జేసియుఁ, గందరంబులు చిందరలాడియు, నడు
ములు కడికండ లొనర్చియు, వాలంబులు గూలనేసియు, పల్లంబులు డుల్లించియు, [3]రాహుత్తులఁ
దుత్తుమురు గావించియు, యుగ్యంబుల వహనయోగ్యత్వంబులు మాన్పియు, సూతుల
నేపణంచియు, రథాంగంబుల భంగించియు, [4]నక్షంబుల శిక్షించియు, రథుల విరథులం
జేసియు, ఖేటంబుల విటతాటనం బొనర్చియుఁ, [5]గైదువ లైదుపది గావించియుఁ, గుత్తుకలు
కత్తరించియు, భుజదండంబులు చెండాడియు, ఫాలంబులు [6]లీలం బొడిచియు విజృంభించిన,
గజకళేబరగిరినికరంబును, దురంగమతరంగంబును, శతాంగతిమింగిలంబును, బదాతి
కమఠవ్రాతంబును, ధవళచ్ఛత్రచామరఖండడిండీరంబును, బలలాంశప్రవాళజాలంబును,
[7]నాంత్రఘోరాహిసమూహంబును, రక్తప్రవాహవ్యూహపూరంబును నగు సమరసముద్రంబు
రౌద్రంబై కనుపట్టె. అందు.

164


సీ.

పోటున కాశించి, పోక ముందఱ నిల్చి | కుంతఘాతంబులఁ గూలువారుఁ,
బఱతెంచి చలమునఁ బరబలంబులు చొచ్చి | యుడుఖడ్గధారల నొరగువారు,
బిరుదులు పచరించి కరకరి నెదిరించి | [8]చక్రపాతంబుల సమయువారుఁ,
దమవారి కడ్డమై తరిమి భీకరవృత్తి | దోమరహతులచేఁ దూలువారు


తే.

నై, రణంబున నుభయసేనాగ్రచరులు | నవ్యవస్థితవిజయభంగాత్ము లగుచు,
దొమ్మికయ్యం బొనర్చిరి దురవలోక | బాహువిక్రమసంపత్ప్రభావ మమర.

165


ఆ.

 [9]తిరిగి వీఁకఁ బోక, ధృతి తప్పి చెదరక, | నిలిచి యుగ్రశౌర్యకలితు లగుచు,
దేవదైత్యవరులు చేవతోఁ గదనంబు | సలుపుచున్నయట్టిసమయమునను.

166
  1. రభట - హ
  2. మావతుల - చెండాడియు తా. ప్ర.లో లుప్తము
  3. రాహుత్తుల - భంగించియు ర. ప్ర. లో లుప్తము
  4. నశ్వంబుల - ర,క
  5. గైదువు - ర
  6. వ్రీలం - క
  7. నంత్ర - మ,తా,తి,తీ,హ,ర,క
  8. చక్రాహతం - తా
  9. ఈ వ. తా.ప్ర.లో లుప్తము