పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

60

వరాహపురాణము


మ.

ధూమ్రాక్షాదిమదాంధదైత్యదనుజస్తోమంబుతో, వారుణీ
తామ్రాక్షీప్రభ బాలభానురుచి నుద్ఘాటింపఁ, జింతామణీ
కమ్రశ్రీయుతసౌధకల్పతరురంగజ్జంభవిద్విట్పురీ
సామ్రాజ్యంబు హరింపఁ గోరి, కదలెం జండప్రభా[1]వోద్ధతిన్.

157


వ.

ఇట్లు కదలి, హిరణ్యాక్షుం డదభ్రశుభ్రతావిజితసుధాకరమరీచికలగు వీచికల
చేతను, [2]బరిహసితశరన్మల్లికాగుచ్ఛవితానంబులగు ఫేనంబులచేతను, సమభ్యస్తశారదా
నాభివిక్రమంబులగు సలిలభ్రమంబులచేతను, సఫలీకృతసుజనాభిలాషంబులగు
ఘోషంబులచేతను, జలక్రీడారంభవిజృంభమాణరంభాముఖ్యాంభోరుహనయనాశ్రుతిపుట
ఘటితప్రమోదంబులగు హంసకారండవక్రౌంచాదిజలవిహంగమనాదంబులచేతను,
దివిజగణమనోహరహసనాకరండంబులగు కమలకహ్లారషండంబులచేతను, సమాక్రాంత
నభోభాగంబగు ప్రవాహవేగంబుచేతను, ముక్తి[3]ప్రాసాదసమారోహణ[4]సోపానకారంబులగు
తీరంబులచేతను, గామితఫలప్రదాన[5]మణిరత్నపేటికలగు నంతికోద్యానవాటికలచేతను
విలోకనీయమై, త్రిభువనజేగీయమానకీర్తిపతాకిని యగు మందాకినిం జేరంబోయి, తత్పరి
సరంబున విడిసె. అంత.

158


క.

రక్షోవిభుఁడైన హిర | ణ్యాక్షుఁడు యుద్ధాభికాంక్ష నమరనదీతీ
రక్షోణి విడియుట సహ | స్రాక్షుఁడు విని, దివిజ[6]బలసమావృతుఁ డగుచున్.

159


సురాసురభీకరసమరము

శా.

భేరీభాంకృతిఘోరఘోషముల దిగ్భిత్తుల్ ప్రకంపింప,
నారావంబున నంబుధు ల్గలఁగ, రత్నస్యందనం బెక్కి, వి
స్తారోదారజయాంకమాలికల గంధర్వుల్ ప్రశంసింప, దు
ర్వారుండై నగరంబు వెల్వడి, రిపువ్రాతంబు భీతిల్లఁగన్.

160


చ.

రణ మొనరింప, దైత్యశిబిరంబునకై చను జంభభేది జృం
భణమున కుత్సహింపుచును, బట్టిన ముద్గరభిండివాలభీ
షణకరవాలముఖ్యబహుశస్త్రసమన్వితహస్తులై, యవా
రణ మునుమున్న దేవతలు రాక్షసవీరులఁ దాఁకి రుగ్రతన్.

161
  1. వోన్నతిన్ - క
  2. నుపహసిత - ర
  3. ప్రసాద - మ,మా,త,తా,తి,తీ,ర,క
  4. సౌపాన - మ,మా,తా,క
  5. గుణరత్న - మా,త,హ,ర,క
  6. గణ - ర