పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

50

వరాహపురాణము


క.

అందంబై, భోగలతా | కందంబై, దివిజనయనకంజాతకృతా
నందంబై, శోభిల్లును | నంందనవన మాపురంబునకు నికటమునన్.

91


ఆ.

[1]అఖిలవిబుధలోచనాహ్లాదకారియై | నవ్యమైన తద్వనంబునందు
ననిచి చిగురు చూపి నవపుష్పఫలములఁ | బొలుచు నెపుడు సకలభూజములును.

92


సీ.

నీరజాప్తాలోకనిరవకాశానేక | సంతానభూరుహచ్చాయలందు,
మకరందరసపానమత్తభృంగీగాన | మహితకేళీలతాగృహములందుఁ,
గుముదారవిందసంకులవాసనాబృంద | వాసితనవసరోవరములందుఁ,
గర్పూరమృగనాభికలితసౌరభశోభి | పల్లరచితతల్పమ్ములందుఁ,


తే.

జతురరంభాదికామినీసహితులగుచు, | వాసవానలయమదైత్యవరుణపవన
యక్షవరశంకరాది[2]సమస్తసురులు | వరుసఁ గ్రీడింతు రమ్మహావనములోన.

93


వ.

ఇట్టి నందనారామంబుచేత నభిరామంబగు దివిజధామంబు రామణీయకంబు
మఱియు నెట్టిదనిన.

94


చ.

మరునకు బొమ్మవెట్టి, యభిమానమునం దుదిముట్టి, తాపస
స్ఫురణ వహించినట్టి యతిపుంగవు బుద్ధిసరోరుహంబు, త
త్పురహరిణేక్షణాజనకపోలమిళద్దరహాసచంద్రిక
ల్బెరసిన యాక్షణంబ, ముకుళించును దానవలోకనాయకా!

95


శా.

ఆలోకంబున నుండు సజ్జనులు [3]దేహాశావిపచ్ఛోకతృ
ష్ణాలోభాదివిదూరులై, యమృత మాస్వాదింపుచున్, యౌవన
లావణ్యసమేతులై, [4]యమరులై, శృంగారసంపన్నులై,
కేళీతత్పరులై, సుఖింతురు మృగాక్షీయుక్తులై నిచ్చలున్.

96


క.

[5]అరివీరులఁ దూలింపను, | బరువడిఁ ద్రిదశాలయంబుఁ బరిపాలింపన్
హరి గలఁడు గాన, దివిజులు | వెఱవక వర్తింతు రధికవిభవోన్నతులై.

97


మ.

లలనా[6]రూపము దాల్చి, దైత్యవరులన్ లావణ్యవారాశిలో,
గలయన్ముంచి, విలాసహాసవిలసద్గంభీరవాక్పాశబ
ద్ధులఁ గావించి, పురందరాదులకు సంతోషంబుగాఁ దొల్లి యా
జలజాక్షుండు సుధారసం బొసఁగడే చౌర్యక్రియాశాలియై!

98
  1. ఈ ప. తీ. ప్ర.లో లుప్తము
  2. సమస్తసురలు - అన్ని ప్ర.
  3. దేహాశీదిపాశోక - మ,తా; దేహాశాదిపచ్ఛాశోక - మా; దాశశాధిపశోక - త; దేహాశాదిపశ్చోక - తి; దేవశాధిపశ్శోక - ర; దేహశాధిపశ్శోక - హ,క
  4. యమృతులై - మ,తా,తి,తీ,హ,ర,క
  5. ఈ ప.తా ప్ర.లో లుప్తము
  6. భావము - మా,త,తా,తి,తీ,హ,ర,క