పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

49


వ.

మఱియుం దత్పురసౌభాగ్యం బెట్టిదనిన.

84


సీ.

కాంచన[1]గోపురకాంతాన్యదుర్గమ | ప్రాకారపరిఖా[2]విభాసితంబు,
దీపితానేకరథ్యాపార్శ్వ[3]సౌధాగ్ర | కలశనూతనరత్నకాంతియుతము,
దివిజతరంగిణీతీరకల్పకభూజ | భూరిపుష్పామోదపూరితంబు,
సర్వలోకాంగనాసౌందర్యగర్వని | ర్వాపణపటువధూరంజితంబు,


తే.

సతతరాజాధ్వ[4]4పుంజపుంజాయమాన | సంచరద్దేవతాప్రజసంకులంబు,
సకలకల్యాణసౌభాగ్యజననభూమి, | లోకవిశ్రుతచరితంబు నాకపురము.

85


ఉ.

తామరసాపకాంతిసముదాయముతోడుత నంధకారముల్
ప్రేమదలిర్పఁ జెల్మి యొనరించునొకో యనఁ బొల్చుఁ, దన్మరు
ద్ధామమునందు వప్రసముదంచితనిర్మలపద్మరాగసు
త్రామమణిప్రభల్ నభముఁ దార్కొని యొక్కటఁగూడి పర్వినన్.

86


ఉ.

ఆనగరంబులోన దివిజాధిపమండితహేమసౌధసం
తానవిరాజితాగ్రభవనంబులఁ గ్రీడలుసల్పు దేవతా
మానిను లంబుజాసనవిమానతురంగమహంసపంక్తికి
న్మానుగ మందమందగమనంబులు నేర్పుచు నుందు రెప్పుడున్.

87


ఉ.

కారుమెఱుంగురాపొడియుఁ గమ్మపసిండిరజంబుఁ గూర్చి, నీ
హార[5]కరామృతంబుఁ బదనంటఁగఁ జల్లుచుఁ, గాయజుండు శృం
గారరసంబు దీపకళగా నిడి చేసిన బొమ్మలో యనన్,
వారనితంబినీమణు లవారణఁ బొల్తురు తత్పురంబునన్.

88


శా.

ప్రోడ ల్నాథులఁ గూడి యానగరి నారోహావరోహాంగజ
క్రీడాబంధములం బెనంగి[6]నఁ, దదంగిస్వేదముల్ వాయ నీ
రాడం, దత్కుచకుంకుమారుణములై యభ్రాపగాతోయముల్
చూడం బొల్చుఁ, బ్రవాళకాంతి[7]పిహితాస్తోకాభి[8]రామాకృతిన్.

89


క.

నాకమునఁ గల వదాన్యా | నీకముఁ గొనియాడ నేల? నీరసశిలలున్,
[9]మాఁకులుఁ, బశువులు దివిజుల | యాకాంక్షలు దీర్చుచుండు ననిశము ననినన్.

90
  1. గోపురాక్రాంతాస్య - మ,మా,త,ర,క; గోపురకాంతాస్వ - తి,తీ;
  2. విరాజితంబు - క;
  3. సౌభాగ్య - మ,త,తి,తీ,హ,ర,క
  4. రాంతభుం - తా
  5. కళామృతంబు - తా
  6. తనురంగ (యతి?) - మ,మా,త,తి,హ,ర,క; తదంగ (యతి?) తా
  7. పిహితస్తోమాబ్ధి - తా
  8. పూర్వాకృతిన్ - మ,త,తి,తీ,హ,ర,క; పూరాకృతిన్ - మా
  9. మ్రాఁకులు - హ