పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48

వరాహపురాణము


మేయంబును, నిరవయవంబు నగుటంజేసి యాద్యంతరహితంబును నిత్యంబునై ప్రవర్తించు.
కావునఁ గాలంబుచేతనే చరాచరంబునకు లయంబును బునరుద్భవంబునుం గలుగు. జగత్కర్త
కాలంబ యని చెప్పిన విని, రక్షోవర్యుండు నిజాచార్యున కిట్లనియె.

77


క.

దుర్గమమై [1]యమృతాంధో | వర్గమునకు సతత[2]మును నివాసంబగు నా
స్వర్గమునఁ గల మహత్త్వము | భార్గవ! నా కానతిమ్ము పరమప్రీతిన్.

78


వ.

అనిన శుక్రుం డిట్లనియె.

79


సురలోకభోగభాగ్యములు

క.

శ్రీకరరాజద్విజపట | లీకృతవివిధాధ్వరావళీపుణ్యఫలం
బై కామ్యమాన [3]మగుటయు | [4]నాకముఁ గొనియాడ వశమె నా కమరారీ?

80


ఉ.

భర్గజటాటవీగళితభవ్యనదీతటమందు, శత్రుష
డ్వర్గము నొంచి, భూమి సుఖవర్జితులై తప మాచరించి, స
న్మార్గవిహారులై సుజనమానితులై విలసిల్లువారికిన్
స్వర్గమె కాదె కామ్యఫలసారము, దానవవంశశేఖరా?

81


సీ.

అష్టాంగయోగవిద్యాభ్యాసదక్షులు, | బ్రహ్మచర్యవ్రతఫలితగతులు,
నగ్నిహోత్రాదిక్రియామార్గనిరతులు, | సాంగవేదత్రయాధ్యయనపరులు,
నన్నదానోపార్జితాఖండకీర్తులు, | నిజకులోచితధర్మభజనరతులు,
సముచితౌదార్యనిస్తంద్రు, లత్యంతప్ర | [5]శాంతులు, [6]సంతతసాధు[7]మతులు,


తే.

కదనమున వైరిసేనకు నెదురు నడచి | శస్త్రహతిఁ బ్రాణములఁ బాసి చనిన ఘనులు,
దివ్యకాంతాసహస్రసంసేవ్యు లగుచు | నమరపురమున వసియింతు రసురవర్య!

82


మ.

శ్రుతిపారంగతుఁడై , సదక్షిణమఖస్తోమంబు వాటించి, [8]సం
గతపుణ్యుండగు భూసురోత్తముఁడు, నాకంబందుఁ బ్రాపించు, నూ
ర్జితకల్పద్రుమమంజరీమధుర[9]మైరేయామృతాస్వాద[10]
ర్వితగీర్వాణవధూసితంబభరనీవీమోక్షసత్సౌఖ్యముల్.

83
  1. యమృతాంధస - తి,తీ; యమృతాగస - మ; యమృతాగమ - మా, తా; యమృతాశన - హ
  2. నిజ - మ,మా,తి,తీ,హ,ర
  3. మగుటన్ - త,తా
  4. నాకమునంగల మహత్వ మానతి యీవే - క
  5. శాంతప్రసన్నాస్య - తా,మా
  6. విన్యాస - త
  7. జనులు - తి,తీ,ర
  8. సన్నుత (యతి?) - మ,మా,త,తి,తీ,హ,ర,క
  9. రసాక్షీణరసా - తా
  10. కల్పిత - మా