పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

47


సీ.

శతవత్సరములు వర్షము లేక ధరమీఁది | సస్యభూరుహలతాజాల మెల్ల
ఫలశూన్యమై పోవఁ బ్రజలు దుర్భిక్షంబు | చేత బెగ్గిలి యతిక్షీణు లగుచు
నిజకులోచితధర్మభజనంబు వర్జించి |చౌర్యసాహసముఖాకార్యనిరతు
లగుచు జీవితములకై పుత్రభార్యాదు | లను విక్రయింపుచు వనములందు


తే.

గిరులయందును దృష్టిగోచరములైన | శాక[1]మూలాదిభక్ష్యముల్ చవులు చూచి
క్షుత్పిపాసాతిశయజాతశోకవహ్ని | చే నశింతురు కాలావసానమునను.

71


క.

పక్షిపశుకీటతతి యధి | కక్షుతృష్ణానలమునఁ గడతేరి [2]చనన్
బక్షీణమగుచు విశ్వము | వీక్షింపఁగ సర్వశూన్యవృత్తి వహించున్.

72


ఉ.

అంతటఁ జండభానుఁడు సహస్రకరంబులు సాచి, భూతలా
భ్యంతర వారిపూరముల నన్నిటిఁ గ్రోలి, యశేషవల్లికా
క్రాంతమహీజగుల్మతృణ[3]రాజిరసంబుల నెల్లఁ బీల్చి, దు
ర్దాంతనిజప్రతాపమున రాయిడివెట్టు నజాండభాండమున్.

73


మ.

ఘనశౌర్యోన్నత! యంతలో నురగలో- కంబందు సంకర్షణా
ననజాతంబగు పావకం బనిలబృందప్రేరితంబై ఘన
స్వనసంపన్నతఁ బ్రజ్వలింపుచును బంచాశచ్ఛతాబ్దంబు లు
గ్రనిరూఢిం గబళించి యాహుతిగొనున్ బ్రహ్మాండసారాంశమున్.

74


క.

నీరేరుహగర్భాండం | బారయ దందహ్యమానమై యప్పగిదిన్
సారము చెడి దగ్ధపటా | కారంబునఁ గానఁబడు జగన్నుతచరితా!

75


మ.

శతపంచాబ్దము లయ్యెడ న్విసరు ఝంఝామారుతం బుగ్రగ
ర్జితము ల్మీఱఁగ మేఘబృందమును వర్షించున్ దిశాసామజా
యతశుండాసమవారిధారల [4]జగం బావారిలోఁ గజ్జల
ప్రతిమంబై యణుఁగు [5]న్విధీందురవితారాముఖ్యపూర్వంబుగన్.

76


వ.

ఇట్లు జగం బేకార్ణవంబైన, వసుంధర గంధరహితయై జలంబునం గలయు. తత్సలిలం
బును గతరసంబై తేజోలీనంబగు. తత్తేజంబులును రూపశూన్యంబై వాయుగతంబగు. త
ద్వాతూలంబును స్పర్శవర్జితంబై యాకాశంబున నణంగు. తద్గగనంబును విగళితశబ్దంబై
భూతాదిం బ్రవేశించు. తద్భూతాదిమహద్రూపస్థగితంబగు తన్మహద్రూపం బహంకార
గ్రస్తంబగు. తదహంకారంబు సత్త్వాదిగుణమిళతంబై కాలగళితంబగు. ఆకాలం బపరి

  1. భక్ష్యాదిమోహముల్ - ర
  2. శుభం - మా,త
  3. కాది - మా,త
  4. జంబ్వాంభోధి - తీ; జంబూవారి - తి,హ,ర
  5. న్విధుండు - మ,తా,తి,తి,హ,ర,క