పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

44

వరాహపురాణము


క.

శక్రారివర్య! విను, కా | మక్రోధవిమోహలోభమదమాత్సర్యా
ఖ్యాక్రూరాంతరరిపుష | ట్చక్రము నచ్చోట గగన[1]జలజము దలఁపన్.

48


చ.

కలకలకంఠనాదముల గర్వము సర్వము [2]జట్టిగొన్న [3]మం
గళగళసుస్వరంబు గలకాంతలు చెంతలఁ జేరి కొల్వఁగాఁ
గొలకొలమంచు దేవతలు కోరిక లీరిక లొత్త [4]నా గమిం
గిలకిల నవ్వి కేళిఁ [5]దులకింతురు కాంతురు సౌఖ్య [6]మచ్చటన్.

49


వ.

ఇ ట్లనన్యసామాన్యరామణీయకధురంధరంబై పురసరిద్గిరివనరాజివిరాజితంబై న ఫణి
భువనంబు, ద్వాదశకోటియోజనాయతంబును, ద్రయోదశశతాధికపంచాశత్కోటియోజన
విస్తృతంబునునై యొప్పుచుండు. మఱియు జగత్త్రయంబునకు మధ్యమలోకంబైన మహీ
మండలం బెట్టిదనిన.

50


చ.

పురశరధిప్రసిద్ధవనపుణ్యసరిద్గిరియుక్తయై, మనో
హరతరయై, సమస్తవిభవాకరయై చెలువొందు నివ్వసుం
ధర, నురగాధినాయకుఁడు దాల్చు వినిర్మలరత్నమండలాం
తరతరళప్రభావలనధన్యసహస్రఫణాగ్రసీమలన్.

51


కాంచనాద్రి కమనీయత

క.

రాత్రించరేంద్ర! యిట్టి ధ | రిత్రీమధ్యమునఁ గిన్నరీగానకళా
పాత్రమన నొప్పుఁ గాంచన | గోత్రము, మణిసానుకాంతిగుణచిత్రంబై.

52


ఆ.

ఆసువర్ణశైల మాధారముగ దివ్య | రత్నశోభమానరథము నెక్కి
దివిజవరులు పొగడఁ దేజస్సమగ్రుఁడై | సంచరింపుచుండు జలజహితుఁడు.

53


సీ.

రాజహంసావళీరమణీయ మానసా | ద్యమితపుణ్యసరోవరములు గలిగి,
సంతతఫలపుష్పసంపత్సమాకీర్ణ | చైత్రాదివనసమాజములు గలిగి,
యమృతాశనాంగనాసముదయక్రీడామ | నోహరరత్నసానువులు గలిగి,
యభ్రంకషప్రభావిభ్రమోదంచిత | కాంచనశృంగసంఘములు గలిగి,


తే.

పూర్వపశ్చిమసాగరంబులు గమించి | జంభశాసనముఖదేవసదన మగుచు
[7]సోమసూర్యులు [8]చనుపందఁ జోద్యమంది | రాజితంబయ్యె మేరుధరాధరంబు.

54
  1. జలదము - త
  2. జుట్టు - త,తి,క
  3. మంగళతర - మ,తా,తి,తీ,హ,ర
  4. నాగముం - త,మా; నాగమం - తి,తీ,హ,ర; గానమం - మ
  5. మళకింతురు - మ,తి,తీ,హ
  6. మంతటన్ - తి,తీ
  7. ఈ పాదము - మా, త, తా,హ,ర,క ప్ర.లో లుప్తము
  8. పెనుపంద - తి,తీ