పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

39


శా.

భావజ్ఞానవచోవిశేషవిజితబహ్మల్, ప్రతాపావలే
పావిర్భావనిరస్తభాస్కరులు, విత్తాదానదానక్రియా
ప్రావీణ్యాపరకిన్నరేశ్వరులు, శౌర్యశ్రీకిరీటుల్, మహీ
దేవక్షత్రియవైశ్యశూద్రులు పురస్థేము ల్విచారింపఁగన్.

15


చ.

తరణిశతప్రతాపుఁడగు దానవభర్తకు రాజధాని, యిం
దిరకు విహారమందిరము, నిర్జరకోటికి సంతతస్పృహా
కరవిభవాకరంబు ననఁగాఁ, బురి బల్మియుఁ గల్మియు న్మనో
హరతయు వేఱువేఱ కొనియాడఁగ నేటికి మాటిమాటికిన్?

16


సీ.

తరుణీరతిశ్రమాహరణమాత్రమె కాని | [1]విచ్చలవిడి గాడ్పు విసర వెఱచుఁ,
[2]గమలవికాసమాత్రమె కాని భానుండు | దీపించి వేఁడిమిఁ జూప వెఱచుఁ,
దరుసస్యపోష్యమాత్రమె కాని జలదంబు | ఘోషించి యతివృష్టి గురియ వెఱచుఁ,
[3]బచనాదిసత్క్రియారచనమాత్రమె కాని | శిఖి తీక్ష్ణకీలలఁ జెలఁగ వెఱచుఁ,


తే.

జండభుజదండమండితమండలాగ్ర | ఖండితాఖండలీయ[4]కాఖండసైన్య
మండలుండగు దనుజేంద్రు మహితశౌర్య | బుద్ధిపాలితమైన తత్పురవరమున.

17


హిరణ్యాక్షుని భీకరతపశ్చర్య

వ.

ఇవ్విధంబున సకలలోకనయనానందకరంబైన పంచజనావతనగరంబున కధీశ్వ
రుండగు హిరణ్యాక్షుం డొక్కనాఁడు, జగంబు నేకచ్ఛత్రంబుగాఁ బాలింపందలంచి, నిజ
రాజ్యభారం బమాత్యాధీనంబు చేసి, జటావల్కలంబులు ధరియించి, మునివేషంబునం
జనిచని ముందట.

18


ఉ.

స్వర్వనితావిహారవిలసద్వనఝాటము, శేముషీ[5]తపః
కుర్వదనేకమౌనియుతకూటము, శాఖిశిఖానిరుద్ధస
ప్తార్వరథోరుఘోటము, ననంతవరాటము, శోభమానసౌ
పర్వణపర్వత[6]ప్రవర[7]భర్మకిరీటము, హేమకూటమున్.

19


క.

కనుఁగొని, తచ్చిఖరంబునఁ | గనకాక్షనిశాటకులశిఖామణి, యేకాం
తనిశాంతమధ్యమంబున | ననుమోదవిరాజితాననాంభోరుహుఁడై.

20
  1. విచ్చనవిడి - హ,ర,క
  2. హ,ర ప్ర.లో 2, 4 పాదములు లుప్తము; అనుకూలుఁడై
    కాని యాదిత్యుఁ డురుదీప్తి కిరణముల్ పలుమారు నెఱప వెఱచు - మ, తి, తీ; జనశీతభయనివారణము మాత్రమె గాని మిహిరారి స్వేచ్ఛచే మించ వెఱచు - క
  3. మందమైని యనలుండు మహి నణంగుటె కాని దంటమోము లరణ్య మంట వెఱచు - మ,తా,తి,తీ
  4. నాఖండ - మ
  5. తమః -తి,తీ,ర
  6. ప్రకర - తా
  7. ధర్మ (యతి?) - మ,తా