పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

36

వరాహపురాణము


ఉ.

తామసజన్మభూమి యగు దానవవంశమునం జనించి యే
మేమియు బుద్ధిలేక, జగదీశ్వర! నీ కొనరించునట్టి నిం
దాముఖదుష్కృతంబులు మనంబునఁ బెట్టక కావుమీ సుర
గ్రామణి! యంచుఁ బల్కి, దితిగర్భముఁ దూఱఁగ నేఁగి రిద్దఱున్.

186


వ.

అని పలికి.

187


ఆశ్వాసాంతపద్యగద్యములు

చ.

[1]పరమకృపావతార! కుల[2]పాలన! సద్ద్విజలోకమానితా!
శరధిగభీర! [3]సాలబలజాల! గుణ[4]ధ్రవభోగవాసవా!
సరసకళావిచారి! వరసారసమిత్రరమాకృపాణ! ని
ర్భరనగరాజధీర! నవభావజ! నిత్యవిరాగకామితా!

188


క.

దిఙ్మానినీకచాగ్ర | స్రఙ్మంజులకీర్తిధన్య! సకలక్షోణీ
భుఙ్మాన్య! సుజనసమ్మత | వాఙ్మాధుర్యాభిరామ! వైభవరామా!

189


మాలిని.

విమలగుణవిశాలా! విస్ఫురత్కీర్తిలోలా!
సమయవిహితదానా! సర్వవిద్యానిధానా!
కమలరుచిరనేత్రా! గంగమాంబాసుపుత్రా!
హిమగిరిసమధైర్యా! యెఱ్ఱనామాత్యవర్యా!

190


గద్యము

ఇది శ్రీ హనుమత్కరుణావరప్రసాదాసాదితసారస్వతనిరాతంక, చంద్రనామాంక
రామవిద్వన్మణితనూజాత, అష్టఘంటావధానపరమేశ్వరబిరుదవిఖ్యాత, హరిభట్టప్రణీ
తంబైన వరాహపురాణంబునఁ, గైవల్యఖండంబను పూర్వభాగంబునందుఁ బ్రథమాశ్వాసము.

  1. నాగబంధము
  2. పావన - అన్ని ప్ర.
  3. సార - త,తా
  4. ధ్రువ - మా; వ్రత - తా