పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

35


క.

మురహర! యీ[1]శాపానల | పరితాపము మాన్ప నొం డుపాయము మాకున్
దొరకునె? నిర్హేతు భవ | త్కరుణామృతసేచనంబు గలుగక యున్నన్.

177


వ.

అని శాపాగమనవృత్తాంతం బెఱింగించి, కించిదాకుంచితముఖులై పదనఖ
ముఖంబుల నేల వ్రాయుచుఁ, గన్నీరు మున్నీరుగా జాఱ నూరకున్న, దౌవారికులకు దానవారి
కరుణాతరంగితంబులగు నపాంగంబుల నవలోకించి యిట్లనియె.

178


జయవిజయులకు నభయప్రదానము

సీ.

ఏమి సేయఁగ వచ్చు, నింద్రాదిదివ్యులు | కోపించి మీ కిట్లు శాప మిచ్చి,
రది బ్రహ్మరుద్రాదులైన మాన్పఁగలేరు, | దైవికదుఃఖంబు దగులకున్నె?
కార్యంబు లుదయించుఁ గర్మానుగుణములై, | [2]కాఁగల పను లేల కాక మాను?
జన్మాంతరంబుల సంచితంబగు కర్మ | మనుభవించినఁగాని యణఁగిపోదు,


తే.

దీనికై యుమ్మలింపక, దితికి మీరు | తనయులై పుట్టి, రాక్షసత్వము భజించి
యవని యేలుఁడు, తోడన యవతరించి | మిమ్ము వధియింతు [3]నే నిదె నమ్మి చనుఁడు.

181


క.

నను నిందించిన దోషం | బును జెందదు మిమ్ము, జన్మములు మూఁడును గై
కొని మత్సాయకహతులై, | కనియెద రటమీఁదఁ బూర్వగతి [4]మత్పదమున్.

180


క.

గర్హితదితిసుతభావ మ | నర్హంబని యంటి రేని, యమలిన ధరణీ
బర్హిర్ముఖవంశజులై, | గార్హస్థ్యముఁ దాల్చి యజ్ఞకర్మ[5]స్థిరులై.

181


క.

వేదాంతశాస్త్రపారగు | లై, దానతపోనిరూఢు లై, రక్షితమ
ర్యాదులయి, యేడు[6]జన్మము | లాదరమునఁ గడపి కాంచుఁ డస్మత్పదమున్.

182


వ.

అనిన, జయవిజయులు, లోకవిష్ణుండును బరమయోగి[7]మనఃకమల[8]వర్తిష్ణుండును
గరుణామృతవర్దిష్ణుండు నగు విష్ణునకుం బునఃప్రణతులై, యిట్లనిరి.

183


క.

ఫణిశయన! మిమ్ముఁ బాసిన | క్షణ మొక్కటి మాకు బ్రహ్మకల్పంబగు, బ్రా
హ్మణుల మయి సప్తభవములు | గణనాతీతాబ్దతతులు గడవఁగఁ గలమే?

184


క.

[9]జననత్రయమున రాక్షస | తనువులు గైకొని జనించి, తావకవైరం
బను నావచేత, నాప | ద్వననిధి వేగంబ దాఁటువారము కణఁకన్.

185
  1. శాపోక్తుల - మా
  2. రాఁగల పనులేల రాకమాను - త
  3. నేనిది - మ,త,తి,తీ,హ,ర,క
  4. మత్పురమున్ - మ,మా,త
  5. స్థితులై - త
  6. భవముల నాదర - త
  7. మర్మ - తి,తీ
  8. వర్ధిష్ణు - అన్ని ప్ర.
  9. అనుభవముననీ - మ,తి,తీ,హ,ర,క; ఘనశత్రులమై - మా; ఘనవైరంబున - త