పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

33


శా.

శ్రీకాంతాధరణీసతీయుతముగా శృంగారసౌధాంతర
వ్యాకోచప్రసవావళీరచితశయ్యామధ్య నాసీనుఁడై
యేకాంతంబున నున్నవాఁడు హరి, మీ కీవేళఁ దద్దర్శనం
బాకాంక్షించిన నేల కల్గు? సురలారా! తత్తరం బేటికిన్?

161


క.

ఎఱుఁగరు మీరలు కార్య | త్వరితంబున నేఁగుదెంచి తలక్రిందైనన్,
హరియాజ్ఞ లేక యూరక | చొరవచ్చునె మీకు నతని శుద్ధాంతంబున్?

162


క.

ఉండుఁడు మీరిచ్చోట వి | తండావాదములు మాని తాలిమితో, ని
ట్లుం[1]డంగ నోపరేనియుఁ | బొండిప్పుడు [2]మీనివాసభువనంబులకున్.

163


వ.

అని పలికిన జయవిజయుల నయభయగర్భంబులగు వాక్యసందర్భంబులు లెక్క
గొనక, నిర్భరకార్యాపన్నతాకృత[3]వివేకచ్ఛేదులగు వాసవాదులు నీరజోదరు[4]భవనద్వారంబుఁ
దూఱి చనునంత.

164


క.

జయవిజయులు రోషారుణ | నయనంబుల నిప్పులొలుక నాళీకవన
ప్రియ[5]తనయచండదండ | ద్వయసమముల హస్తవేత్రదండముల వడిన్.

165


సీ.

మోదిరి జంభారి[6]ముకుటాగ్రమాణిక్య | పటలంబు నలుగడఁ జిటిలిపడఁగఁ,
జదిపిరి దక్షిణాశావల్లభుని సము | ద్దండదండము సూక్ష్మఖండములుగఁ,
అహరించి రంబుధిప్రభుని పాణిగృహీత | దృఢపాశలతికలు ద్రె[7]వ్వి తొరుగ,
సరిచిరి యక్షనాయకుని కేయూరకం | కణముఖ్యరత్నభూషణము లురుల,


తే.

ననిలుకరములు విఱిచిరి మునులఁ బఱచి | రచలతం దిట్టి రఖిలసంయములఁ గొట్టి
రాగ్రహంబెల్లఁ దమమూర్తు లయ్యె ననఁగ | హరిగృహద్వారరక్షణాయత్తు లగుచు.

166


క.

ఈవిధమున మురభంజన | దౌవారికచండవేత్రదండాహతులై
దేవతలు మునులు గంధ | ర్వావలియును యక్షకిన్నరాదులు యతులున్.

167


జయవిజయులకు ఘోరశాపము

చ.

హరిహయుఁ డాదిగాఁగల మహామహులందఱు దండఘాతజ
ర్జరితశరీరవేదనల రాఁజిన రోషము మిన్నుముట్ట, నా
హరిపదసేవకోత్తముల నల్కఁ గనుంగొని, “మీరు రాక్షస
స్ఫురితకులంబునన్ ధరణిఁ బుట్టుఁడు శ్రీహరికి న్విరోధులై.

168
  1. డఁదగ - తి,తీ,క
  2. నిజ - క
  3. వివేకభేదు - మా,త,తి; వివేకవేదు - తా
  4. భువన - మ,తి,తీ,హ,ర,క
  5. తాయతచండ - మ,త; తయనుచందా - తి,తీ,క; తయచండా - హ,ర
  6. మకుటా (యతి?) - త
  7. ద్రెళ్ళి - మ,తా