పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24

వరాహపురాణము


చ.

ఇట విను మింక నొక్కటి సురేశ్వర! నిక్క ముపన్యసింతు, ధూ
ర్జటివరమత్తులైన దితిసంభవు లేమియుఁ గన్నుగాన, రీ
[1]కుటిలుల సంహరింప మనకుం గల దిక్కు సరోజనాభుఁ, డా
పటుమతి నాశ్రయించు, మన జయశుభోన్నతు లబ్బు గొబ్బునన్.

97


క.

పూజింపుము హరిచరణాం | భోజంబుల, నతని[2]రూపమును జిత్తములో
యోజింపుము, తద్గుణగణ | తేజోగరిమములు సన్నుతింపుము భక్తిన్.

98


క.

 ఆపన్నరక్షకుండగు | నాపన్నగశాయి దుష్టహరణోచితకా
ర్యోపాయకుశలుఁ డవ్యయుఁ | డాపదలన్నియును మాన్చు నాత్మఁ దలంపన్.

99


ఉ.

కీర్తనమాత్రసాధుజనభేదము మాన్ప ఝషాదివిస్ఫుర
న్మూర్తులు దాల్చి, దైత్యకలము న్నిజహస్తనిశాతచక్రవి
స్ఫూర్తికి విందుచేసి, పరిపూర్ణయశోనిధియైన భక్తలో
కార్తివిదారి, శౌరి, దిగనాడుె దేవమునీంద్రసంఘమున్?

100


క.

వనితారూపముఁ గైకొని | దనుజుల నణఁగించి, యమృతదానంబున నీ
యనిమిషులనెల్లఁ బ్రోచిన | యనుపమచారిత్రుఁ [3]డాప్తుఁ డతఁడే కాఁడే?

101


వ.

అని యివ్విధంబునం బరమార్థంబు తేటపడంబలికిన వాచస్పతికి వాస్తోష్పతి యిట్లనియె.

102


మ.

అమృతాంభోనిధిలోన శేషఫణిశయ్యామధ్యమం దిందిరా
రమణీరత్నముతోడఁగూడి సుఖనిద్రం బొందియున్నట్టి శౌ
రి మురారి న్నిగమాంతవర్తి మరుకీర్తిం గొల్చుటె ట్లాప్రదే
శము చేరంజనలేరు బ్రహ్మ[4]ముఖులున్, శక్తాత్ములే మాదృశుల్?

103


క.

అని హరిపూజాలాభ | మ్మునకు నుపాయంబు వేఁడు పురుహూతుని వా
గ్వినయముల కలరి సురగురుఁ | డనుకంపితహృదయుఁ డగుచు నపు డి ట్లనియెన్.

104


పుండరీకాక్షుని పూజావిధానము

క.

నీ నొడివినట్ల యమృతాం | భోనిధిమధ్యమున శేషభోగీంద్రునిపై
శ్రీ[5]నారీయుతుఁడై హరి | తా నెంతయుఁ గూర్మినుండుఁ దథ్యం బరయన్.

105
  1. కుటిలుర - మ;మా;తి,తీ,హ,ర
  2. రూపుమొగి - మ,మా,హ,క,ర; రూపమొగి - తి,తీ
  3. డాత్ముఁ డాతఁడె - మ,తా; డా మహాత్ముఁడు - త, మా
  4. ముఖరుల్ - తా
  5. నాయకుఁడై శ్రీ - తి,తీ,హ,ర,క