పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

21


మాకు నకుంఠితపరాక్రమంబు ననివారితశౌర్యంబు నచలితజయంబును ద్రైలోక్యాధిపత్యంబును
స్థావరజంగమాదులవలన భయంబు లేకుండుటయునుం గృపసేయవలె నని విన్నవించి,
సాష్టాంగదండప్రణామం బాచరించిన, వారలకుఁ గరుణావశంకరుండగు శంకరుం డిట్లనియె.

77


అసురులయెడ నంబికాధవుని యనుగ్రహము

ఉ.

రాక్షసపుంగవుల్! వినుఁడు! రాఁగల కార్యముఁ [1]దెల్పెదన్, హిర
ణ్యాక్షుఁడు [2]నాఁగ నొక్కఁ డసురాన్వయమందు దితిప్రియాత్మజుం
డై క్షితి నుద్భవించు, ఘనుఁ డాతఁడు దోడుగ, నాజి దేవతా
పక్షము గీఁటణంచి, [3]నిరుపద్రవులై జగ మేలుఁ డింతయున్.

78


చ.

అని వివరించి [4]చెప్పి, దితిజాన్వయవర్యుల నాదరించి వీ
డ్కొని శివుఁ డాత్మలోకమునకుం బ్రమదంబున నేఁగె, నంత నా
దనుజులు నుత్సహించి బలదర్పితులై బహుసైన్యయుక్తులై
వనధిపరీతధాత్రి ననివారణ నేలిరి నిర్భయాత్ములై.

79


వ.

తత్కాలంబున.

80


ఉ.

[5]ధారుణి [6]యుక్కణంగె, కులధర్మము సత్యము దూరమయ్యె, నా
చారము [7]చెంగె, దానములు సాగకపోయెఁ, బరోపకారముల్
జాఱె, దయావిశేష మతిచంచలమయ్యెఁ, బతివ్రతాగుణం
బారయ గొడ్డువోయెఁ, [8]బరమార్థము [9]5గెంటె విచిత్రవైఖరిన్.

81


సీ.

అనిమిషేంద్రున [10]కార్తిఁ గనుమూఁత లేదయ్యె | ననలునితేజంబు పొనుగుపడియె
దండహస్తుని హస్తదండంబు బెండయ్యె | యాతుధానుఁడు మూల నణఁగియుండెఁ
బాథోధిరాజు ప్రాభవమెల్ల నీరయ్యె | గాలి[11]2జవప్రౌఢి తూలిపోయె
ధనదుని విక్రమోత్సవము వెచ్చంబయ్యె | శూలిదేహంబు సాఁబాలు చిక్కె


తే.

గ్రహగణంబులు దినములు గడువఁజొచ్చె | నురగలోకంబు [12]నిశ్శ్వాసభరితమయ్యె
నమరులకు యజ్ఞభాగంబు లమరవయ్యెఁ | గ్రూరదైత్యులు ధరణి చేకొనినకతన.

82
  1. దెల్పుదున్ - మ,మా,త,తి,తీ,హ,ర,క
  2. డనంగ - మ,మా
  3. నిరుపద్రవమై - మ,హ,ర,క
  4. శూలి - మ,తి,తీ,హ,ర,క
  5. ఈ ప. తీ. ప్ర. లో లుప్తము
  6. స్రుక్క - మ,తా,హ,ర,క
  7. చింగె - మ,హ,ర,క
  8. పరధర్మము (యతి?) - తా
  9. గిట్టె - త, తా
  10. కాంతి - తా; కార్తిఁ గనుమూయ - అన్ని ప్ర.
  11. చిత్ర - తా, తి, తీ; జిత - మ,హ,ర
  12. విశ్వాస - తీ