పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

20

వరాహపురాణము


క.

చిరకాలమత్పురాకృత | పరమతపోమహిమ నేఁడు - ఫలితం బయ్యెన్,
దొరకె మనోవాంఛితములు | [1]గరళాశన! నిన్నుఁ జూడఁగలిగినకతనన్.

70


మ.

పరభామారతుఁడైన, నిత్యమదిరాపానోన్నతుండైన, భూ
సురహత్యాకరుఁడైన, హేమముఖవస్తువ్రాతచౌర్యక్రియా
పరుఁడైనన్, “శివ! చంద్రజూట! గిరిజాప్రాణేశ!” యంచున్ నినుం
బురదైత్యాంతక! పేరుకొన్న, నఘనిర్ముక్తుండగున్ గొబ్బునన్.

71


మ.

నినుఁ బూజించి, నినుం దలంచి, రసన న్నీనామముల్ గూర్చి, నీ
కని దానంబొనరించినట్టి నరుఁ డాహా! వామభాగంబునన్
వనజాక్షిన్, గళమందుఁ [2]గందుఁ, దలపై వాఃపూరముం, బాదమం
దనిలాహారవిభూషణంబు గలవాఁడై యుండు నీసన్నిధిన్.

72


ఆ.

భూపరాగముల శమీపలాశములఁ దా | రల నుదగ్రవృష్టి జలకణముల
నెన్నవచ్చుఁ గాని యీశ! మీగుణములు | నలువకైన నెన్ననలవిగాదు.

73


మ.

హర! మృత్యుంజయ! పంచబాణహర! జంభారాతిముఖ్యాఖిలా
మరకోటీరమణిప్రభా[3]స్ఫురణశుంభత్పాద! సర్వేశ! యం
బరకేశా! కమలాసనాదులు భవత్పంచాక్షరీమంత్రత
త్పరులై కాదె! సృజింపఁ బెంప నణఁగింపన్ శక్తులౌ టారయన్.

74


క.

రవి శశి [4]ధరణి జలానల | పవన నభో యజ్వ లనఁగఁ బరగిన యుష్మ
త్ప్రవిమలమూర్త్యష్టకమును | భువనంబులఁ బ్రోచుఁ బరమపురుషవరేణ్యా!

75


ఉ.

నీకలితోత్తమాంగమున నీళ్లును దోసెఁడు చల్లువాఁడు మం
దాకిని [5]మోచుఁ, బువ్వొకటిఁ దా నిడువాఁడు ప్రసన్నచంద్రరే
ఖా[6]కుసుమంబుఁ దాల్చు, [7]సిరిగంద మలందినవాఁడు మన్మథ
ప్రాకటభూతిఁ గైకొనుఁ, బురాకృత పుణ్యఫలంబు [8]తప్పునే?

76


వ.

అని యివ్విధంబున భసితసంభపులైన కపిలోచన ధూమలోచన వక్త్రదంత సూచీ
ముఖ సునాసీర కంకాస్య గృధ్రరోమ చంచరీక సుశేష జ్వాలాకేశ ఖడ్గపాదాది నిశాచరచమూ
నాయకులు పార్వతీరమణునిం బ్రస్తుతింపుచు, నల్లనల్లన నికటతటంబునకుం జేరంజని, కర
పుటంబులు నిటలాగ్రభాగంబులం గదియించి, దేవా! మదీయతపంబులు ఫలితంబులయ్యె.

  1. గరళగళా - తి,తీ
  2. గండములపై - తీ
  3. సరణ - మ,మా,తి,తీ,హ,ర,క
  4. ధర సలిలానల - మా; సలిలశిఖి - తా
  5. మౌళి- తీ
  6. కుముదంబు - మా
  7. తల - తీ
  8. వచ్చునే - క