పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14

వరాహపురాణము


క.

[1]ఏ కథ విని మర్త్యుఁడు పు | ణ్యాకరుఁడై పంకజాసనాధికదివిష
ల్లోకముల మెలఁగు నభయత | నా కథ వినిపింపు నాకు హర్షం బొదవన్.

31


మత్త.

ఆ మహామహుఁ డివ్విధంబున [2]నంబుజోదరతత్త్వలీ
లామహత్త్వము నాలకింపఁ దలంచి పల్కినయంత, నా
రోమశుండు ప్రమోదహర్షితరోమకంచుకితాంగుఁడై
శ్రీమనోహరుసద్గుణ[3]స్తుతి [4]సేయు [5]పూనిక నిట్లనెన్.

32


రోమశముని విష్ణుమహిమ నభివర్ణించుట

ఉ.

శ్రీరమణీమనోహరుఁడు, శేషఫణీశ్వరభోగతల్పుఁ, డం
భోరుహమిత్రకోటిరుచిపూరితమూర్తి, కృపాకరుండు, దు
ర్వారసురారిఖండనుఁడు, వర్ణితనిర్మలకీ ర్తి, నేఁడు సం
స్మారితుఁ డయ్యెఁ, గాన దివసంబు కృతార్థత నొందె నెంతయున్.

33


క.

నారాయణనామము జి | హ్వారుచిరము, విష్ణురూప మక్షిసఫలతా
కారణము, శౌరిచరితసుధారస మది కర్ణసౌఖ్యదంబు ధరిత్రిన్.

34


క.

అక్షయుఁ డచలుఁడు పూర్ణుఁడు | సాక్షియు వేదాంతవేద్యచరితుఁడు నగు ప
ద్మాక్షుం [6]డె పరమతత్త్వము, | వీక్షింపఁ దదన్య [7]మొకటి వినఁబడ దెందున్.

35


క.

దశశతవదనునకైనను | దశశతకిరణాదిదేవతా[8]తతికైనం
దశశతనయనునకైనను | వశమే! హరిగుణము లెఱిఁగి వర్ణనసేయన్.

36


తే.

ఎంతమాత్రంబు మద్వచోహృదయములకు | గోచరించును గోవిందగుణమహత్త్వ
మంతమాత్రంబు వినిపింతు నవధరింపు | వినుతపుణ్య! మృకండుజమునివరేణ్య.

37


క. శ్రోతకు వక్తకు భువన | ఖ్యాతసరోజాక్షసత్కథామృతవృష్టిన్
జేతస్తాపము లణఁగును | భూతభవద్భావిదురితపుంజము [9]దొలఁగున్.

38


చ.

హరిచరితంబులేని యితిహాసము చంద్రుఁడులేని రాత్రి, యం
బురుహములేని దీర్ఘిక, ప్రభుత్వములేని సురూపమున్, రస

  1. ఈ ప. తీ ప్ర. లో లుప్తము
  2. నంబుజోదరు దివ్య - తీ
  3. స్థితి - తా
  4. సేయఁబూనె నదెట్లనన్ - తీ
  5. పూనికె - మ, తా, క; పూనికి - మా
  6. డే పరతత్త్వము - తా
  7. మొండు - తీ
  8. పతి - హ
  9. లణఁగున్ - క