పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

11


సీ.

కలువలు నిడువాలుఁగన్నులు గా, [1]సరో | జంబు భాసురవదనంబు గాఁగ,
నెఱి మించుతేఁటులు నీలాలకములు గా, | బింబికాఫల [2]మధరంబు గాఁగ,
మాలూరఫలములు పాలిండ్ల తెఱఁగు గా, | సంపెంగవిరి నానసొంపు గాఁగ,
హరిమధ్యమస్ఫూర్తి నిఱుపేదనడుము గాఁ, | దామరతూండ్లు హస్తములు గాఁగఁ,


తే.

గనకరంభలు తొడలపొం కంబు గాఁగఁ, | జిగురు లడుగులుగా, ఘనశ్రీసమేత
యగుచు, వనలక్ష్మి రోమశు నాశ్రమమున | నుచితవైఖరిఁ గనుపట్టుచుండు నంత.

8


సీ.

గంధసారమహీజబంధురోరగరాజ | భుక్తముక్తంబులై పొదలి పొదలి,
భూసారజలపూరకాసారకుముదార | విందబృందంబుపై విడిసి విడిసి,
కోమలమాకందకుసుమగుచ్ఛమరంద | కణగణంబులసొంపు గమిచి గమిచి,
భామినీసురతాంతభవఘర్మజల[3]తాంత | గండమండలములఁ గదిసి కదిసి,


తే.

చిన్నివెన్నెలలేఁగొనల్ చిదిమి చిదిమి, | పరువుమరువంపుఁదావుల బలసి బలసి,
మునులతనువుల కింపుగా మొనసి మొనసి, | మందమందానిలము వీచె మలసి మలసి.

9


తే.

మలయగిరివాతపోతసమాగమమున | మౌనివరుఁ డిట్లు మార్గశ్రమంబు వాసి
సంతసింపుచు రోమశసంయమీంద్రుఁ | బ్రేమ నీక్షించి పలికె గంభీరఫణితి.

11


మునీంద్రద్వయకృతపరస్పరసంభావనము

సీ.

సంకర్ష[4]ణాస్యసంజాతానలంబులు | భుగభుగధ్వనులతో నెగయునాఁడు,
శైలంబు లల్లాడ సప్తమారుతములు | బెట్టుగా [5]బిస్సట్లు వెట్టునాఁడు,
తొమ్మిదివిధములతోయదంబులు రేఁగి | ఘోషించి పెనువాన గురియునాఁడు,
రెండారుతెఱఁగులై చండాంశుబింబముల్ | వేఁడియెండలు చల్లి వేఁచునాఁడు,


తే.

దీర్ఘతరముగ నజుఁడు నిద్రించునాఁడు, | వనధి బ్రహ్మాండభాండంబు మునుఁగునాఁడు
నే భయంబును లేక యథేచ్ఛనుండు | నెలమి నీయాశ్రమమ్ము, మునీంద్రతిలక!

12


క.

భూరివటపత్రతలమున | నీరజనాభుండు యోగనిద్రాపరుఁడై
[6]కూరికినప్పు డుపద్రవ | దూరంబని మునులు చేరుదురు నీనెలవున్.

13


చ.

ఫణికులసార్వభౌముఁడును బ్రస్తుతి సేయఁగలేఁడు నీతపో
గుణగరిమంబు, మాదృశులకున్ వశమే? యన; రోమశుండు త
త్ఫణుతికి లేఁతనవ్వు ముఖపద్మము[7]న న్ననలొ త్త, మౌనిరా
డ్గణపరివారితుండగు మృకండుతనూజునితోడ నిట్లనున్.

14
  1. నురోజంబు భాసురవనజంబు - తీ
  2. మధురంబు - మ, మ, త, హ, ర
  3. కాంత - మా, త
  4. ణాఖ్య - తీ, హ, ర
  5. విస్సట్లు - మ, తీ, హ, ర, క
  6. కోరి యటఁ బవ్వళించగ - మ; కూరిమియప్పు డుపద్రవ - హ, క
  7. లోఁ జిగురొత్త - తా