పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8

వరాహపురాణము


మ.

దరహాసంబులు దిగ్వధూతతికి, ముక్తాహారముల్ వాణికిన్,
శరదంబోధరముల్ నభంబునకు, రాజత్కౌముదీజాలముల్
పరిపూర్ణేందున, కూర్మిపంక్తులు పయఃపాథోధికిన్ వైభవా
మరనాథుండగు నెఱ్ఱమంత్రి[1]వరశుంభత్కీర్తిధావళ్యముల్.

43


షష్ఠ్యంతములు

క.

ఈదృశసుగుణాకల్పున, | కాది[2]మభాగవతహితసమంచిత[3]చర్యా
హ్లాదితఫణితల్పునకును, | సాదరజల్పునకు, సత్యసంకల్పునకున్.

44


క.

తిరుమల నారాయణగురు | చరణాబ్జధ్యానమధుర[4]సస్థిరమతిష
ట్చరణునకు, ఫలితకృష్ణ | స్మరణునకు, నరాతిమంత్రిమదహరణునకున్.

45


క.

శ్రీ[5]మహితస్తంభాచల | నామసముద్దామపట్టణస్థితగణక
గ్రామణి , బంధుహితర | క్షామణికిఁ, గవీంద్రపంకజనభోమణికిన్.

46


క.

రాధాధవమురళీరవ | వేధస్తరుణీకరాబ్జవీణావిలస
[6]ద్గాథామృతసదృశవచో | మాధుర్యున, [7]కమితజయరమాధుర్యునకున్.

47


క.

కుటిలరిపుసచివ[8]కోటీ | నిటలస్థలఘుసృణతిలకనిరుపమరేఖా
పటలయుతచరణ[9]నఖునకుఁ, | జటులవచోరచనసుకవిజనసుముఖునకున్.

48


క.

[10]ఉద్యతతాపనిర్జిత | మధ్యందినచండభానుమండలశిఖికిన్,
సాధ్యేతరభయదాహవ | మధ్యభుజాశౌర్యశాతమఖికిన్, సుఖికిన్.

49


క.

తరుణీజనహృదయాంబుజ | పరిచిత[11]శైత్యునకు, దానపాండిత్యునకున్,
బరమోత్సవసంపాదిత | హరిహితకృత్యునకు, నెఱ్ఱ నామాత్యునకున్.

50


తే.

అచలితాభ్యుదయపరంపరాభివృద్ధి, | గా సుధారసమధురోక్తి గౌరవమునఁ
గణఁగి, యేఁజేయు నిమ్మహాగ్రంథము నకు,| [12]నేధమానకథాసూత్ర మెట్టి దనిన:

51
  1. వరు - తి
  2. మహాభాగవతసమంచిత - త
  3. వర్యా
  4. సుస్థిర (యతి?) - మ, త, తా, ర; సంస్థిర - మా
  5. మహితదుఃఖచటనాసముద్ధామ - మ; మహితాదంభాచలనామసము - త; మహిదుగ్ధంబాచలనామ - తి, హ
  6. ద్గానామృత (ప్రాస?) - మ, మా
  7. కెఱ్ఱనాఖ్యమంత్రీంద్రునకున్ - తీ; కెఱ్ఱనామమంత్రీంద్రునకున్ - తి, హ, ర; కును రోషమదహరణునకున్ - మ
  8. కోటి - ర
  9. సఖునకు - మా
  10. ఈ పద్యము తీ - ప్ర.లో లుప్తము
  11. చైత్యునకు - మ, ఆ, తి, హ, ర; చైత్రునకు(?)
  12. సిధ్ధమాన - మ, మా, తా, త, తీ, హ, ర, క