పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అవతారిక

7


ఆ.

ఆ వధూటియందు నా మంత్రివరునకు | నుదయమంది రర్థి సదయమతులు
హేమశైలధీరుఁ డెల్లమంత్రీంద్రుఁడు | పంచబాణనిభుఁడు పంచవిభుఁడు.

38


వ.

ఇవ్విధంబున లోకోత్తరగుణరత్నోదారంబగు కాశ్యపగోత్రపారావారంబునం
గొలిపాక సర్వయప్రభు గంగాంబికాగర్భశుక్తిమౌక్తికంబు లగు తనూభవులు మువ్వుర
లోనం, గృతినాయకుండును [1]రేఖావిజితపంచసాయకుండును నగు నెఱ్ఱయ మంత్రిసార్వ
భౌముని త్రిభువనపవిత్రంబగు చరిత్రం బెట్టిదనిన.

39


సీ.

తన కీర్తికామినిం గని మునుల్ వాగ్భవ | మంత్రంబు చెప్పి నమస్కరింపఁ,
దన మనోహరరూపదర్పక[2]కళఁ జూచి | యువతులు మోహాబ్ధి నోలలాడఁ,
దన నీతిసౌష్ఠవంబునకు శాత్రవలక్ష్మి | యభిసారికాలీల నభిగమింపఁ,
దన యీగి కులికి యాచనకదారిద్ర్యంబు | లరిరాజమంత్రుల నాశ్రయింప


తే.

వెలసె, హరిదంతవేదండవితతగండ | మండలస్రావిమదపానమత్తమధుప
మధురసంగీతజేగీయమానయశుఁడుఁ, | హేమగిరిధీరుఁ, డెఱ్ఱమంత్రీశ్వరుండు.

40


మ.

నవతెంతుం గొలిపాక యెఱ్ఱనికిఁ దేజశ్శౌర్యగాంభీర్యస
త్త్వవిభుత్వోక్తి ధనుర్జయోన్నతి [3]శమత్యాగక్రియాకాంతులన్;
సవితన్, సాత్యకి, సింధు, సీరి, సురశాస్తన్, [4]సూతు, సేనాని, సైం
ధవనిర్భేదను, సోము, సౌమ్యఘను, సంతానంబు, సస్యాధిపున్ఇ.[5]

41


సీ.

[6]భుజశౌర్యవైభవసుజనరక్షణముల | నరహరి విఖ్యాతిఁ బరిణమించి,
చతురభాషాస్వామిహిత[7]భూతి గరిమల | ఫణినాయకాంగదప్రౌఢిఁ దాల్చి,
సమధికసత్త్వతేజశ్శుద్ధిమహిమలఁ | బవనమిత్రస్ఫూర్తిఁ బరిఢవించి,
హరికీర్తనజ్ఞానవర[8]కాంతిగుణముల | సురమునిజనకవిశ్రుతి వహించి


తే.

వర్ణనకు నెక్కె, భారతీకర్ణపూర | సారకహ్లారకర్ణికాస్రావిమధుర
మధురసామృతమాధురీమందిరాయ | మాణవాగ్జృంభణుం డెఱ్ఱమంత్రి[9]3వరుఁడు.

42
  1. లేఖా - మ, త, తి, తీ, హ, ర
  2. కథ - త, తి, తీ, హ, ర, మ, మా
  3. యశః - తీ
  4. సౌరి - తీ
  5. ది అక్షరగుణితవృత్తము
  6. గూఢ తృతీయము
  7. భూరి - త, తా
  8. కాంత - హ
  9. విభుఁడు - తి, తీ, హ