పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అవతారిక

5


చ.

సురుచిరలీలఁ జెన్నవిభు సోదరుఁడైన యనంతమంత్రిశే
ఖరుఁడు, దిశాంగనాకబరికాతతులన్ నిజకీర్తిమంజరీ
పరిమళభాసురంబులుగ భక్తి నొనర్చుచు, [1]గంగమాంబికం
బరిణయమయ్యె, శంకరుఁడు పార్వతిఁ బోలెఁ బ్రమోదమానుఁడై.

25


వ.

తదనుసంభవుండు.

26


శా.

నించెం గీర్తులు పద్మజాండమున, మన్నించెం గవిశ్రేణి, నా
లించెన్ విష్ణుపురాణసంహితలఁ, బాలించెం ధరాకాంత, నీ
క్షించెన్ లోపల నంబుజోదరుని, రక్షించెన్ సుధీబంధులన్,
మించెన్ మంత్రుల సర్వయప్రభుఁడు, నిర్మించెం బ్రతాపార్కునిన్.

27


శా.

రంగచ్చక్రపయోధరన్, గమలవక్త్రన్, బంధుజీవాధరన్,
శృంగారోరురసాన్వితన్, గువలయాక్షిన్, జంచరీకాలకన్,
గంగాంబన్ వరియించె నా సచివ లోకస్వామి, వారాశి ఠే
వం, గల్యాణగుణావళీమణిగణవ్యాసంగగంభీరుఁడై.

28


క.

ఆ రమణీ రమణులకుఁ గు | మారులు జనియించి రనుపమానులు [2]ఘనులై
ధారుణిఁ బొడమిన సౌక్షా | [3]త్సారసభవ శివ ఫణీంద్రశయను లనంగన్.

29


సీ.

విదితప్రసన్నతాసదనంబు వదనంబు, | కమలబుద్ధివిధాయి కన్నుదోయి,
విమలసూనృతభూషణములు భాషణములు, | రామచంద్రపదాను[4]రక్తి భక్తి,
[5]సంతతదానప్ర - శస్తముల్ హస్తముల్, | [6]చింతితసకలార్థసిద్ధి బుద్ధి,
యమితవేదార్థపూర్ణములు కర్ణమ్ములు, | హరికథా[7]వర్ణనాభ్యసన రసన


తే.

గాఁగ, విలసిల్లె బలి శిబి కర్ణ ఖచర | [8]కామధుగ్ధేనుసురరత్నకల్పభూజ
దానవిఖ్యాతి విజయా[9]పదానజనిత | చిరయశో[10]హారి, సర్వయ చెన్నశౌరి.

30
  1. వంగ - తి, హ
  2. సచివాకారముల ధాత్రిఁబొడమిన సారస - మ, మా, త, తి,తీ, హ, ర
  3. సారససంభవఫణీంద్ర - తి
  4. రక్త శక్తి - తా
  5. సతతదానప్రశస్తములు హస్తమ్ములు - మ, మా, తా, తి, హ, ర; సతతదానప్రశస్తములు హస్తములు వాంఛితజనసతలార్థ - తీ
  6. శ్రీల సత్సకలార్థ - తా
  7. వర్ణనా - త
  8. కామధేనునిర్జరరత్న - తీ
  9. పధానివనిత - మ; వధానజనిత - మా; వధానవినుత - తా; వధానవితతి - తీ; పధానవనిత - హ; విధానివనిత - ర
  10. ధార - మ, మా, త, తి, హ, ర