పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2

వరాహపురాణము

పూర్వకవీంద్ర పురస్కృతి

సీ.

[1]భారత విరచనోపాయు సౌత్యవతేయు, | లోకసన్నుతుని వల్మీకసుతుని,
శుభకరవాగ్విలాసునిఁ గాళిదాసుని, | సత్కావ్యతోషితస్థాణు బాణుఁ,
గమలాప్తవరశుభాకారు మయూరునిఁ, | గవితాకళాచమ - త్కారుఁ [2]జోరు,
భూరి[3]విద్వన్మౌళి హీరు [4]శ్రీ హీరుని, | సత్కవీశ్వరకృతశ్లాఘు మాఘు,


తే.

నర[5]నుతాంధ్రవచోధుర్యు [6]నన్నపార్యు, | సూక్తిమణిరాజిఁ దిక్కన సోమయాజి,
నుతి సురాచార్యు నెఱ్ఱనామాత్యవర్యుఁ | బ్రౌఢిఁ దలఁచెద సాహిత్యరూఢి మెఱయ.

6


కుకవి తిరస్కృతి

మ.

కవి[7]రాజార్జిత[8]కావ్యకోశగృహరంగద్వాక్యమాణిక్యముల్
సవడిన్ మ్రుచ్చిలి పోఁకవక్కకయినం జట్టీయఁగా, [9]హీన మా
నవగేహంబుల [10]సందిగ్రంతలనె [11]మందవ్యాప్తి వర్తించు దు
ష్కవిచోరావళి నిల్వనేర్చునె సుధీచంద్రాతపస్ఫూర్తికిన్?

7


వ.

అని యివ్విధంబున నిష్టదేవతాస్మరణంబును, బురాతనకవీశ్వరానుసరణంబును,
గుకవి నిరాకరణంబునుం జేసి, శబ్దార్థభావ[12]రసాలంకారబంధంబుగా నొక్క ప్రబంధం
బంధ్రభాషాభవ్యంబగు [13]వచనకావ్యంబుగా రచియింపం బూనిన సమయంబున.

8


కంబముమెట్టు నగరీప్రశంస[14]

సీ.

వరుణదిగ్వీథి నే పురమునఁ బ్రవహించెఁ | [15]బావనసలిలసంపన్న[16]మున్న,
దీపించె నే పురి గోపికామానసా | స్పదవర్తి చెన్నగోపాలమూర్తి,
భాసిల్లె నే వీటఁ బ్రహ్లాద భక్తి వి | శ్రాణి కొండ నృసింహ శార్ఙ్గపాణి,
యే పట్టణంబునఁ జూపట్టె హితపద్మ | హేళి [17]వీరేశ బాలేందుమౌళి,


తే.

చతుర చతురంగబల రత్నసౌధ యూథ | సాల గోపుర తోరణ సకలవర్ణ
పౌరవారాంగనాజనప్రముఖ[18]వస్తు | మేదురం బట్టి కంబము మెట్టు పురము.

9
  1. భారతీ - మ, మా, త, తి, హ, ర
  2. శూరు - మా
  3. విద్వన్మణి - తీ; విద్వన్మనోహర - క; విద్వన్మనోంబుజరవి భారవి - తా
  4. శ్రీహారు - మ, తి, తీ, హ, ర, క
  5. మతాంధ్ర - మ
  6. నన్నయార్యు - క
  7. రాజార్చిత - మ, మా, త, తా, ర
  8. వాక్య - క
  9. జూచు హీనమానవగేహంబుల - మ; హీనమానవ గేహంబుల మా, త; జూచు మావనగేహంబుల - తా; జూచు హీనవదేహంబుల - తి, హ, క; జూచి హీన వధేహంబుల - తీ
  10. సందికంతల - త; సందిగంతుల - తా; సందు గొందులనె - తీ
  11. మంది (యతి?) - తి, ర, క
  12. రసాలంకారానుబంధంబుగా - త, తీ, ర, క
  13. వచనరచనా - తా; పద్యకావ్యంబుగా - తీ; భవ్యంబుగా రచియింపంబూనిన సమయంబున - క, ప
  14. 9 - 18 వఱకు క ప్ర. లో లుప్తము
  15. భావన స్మృతుల - తీ
  16. పెన్న- మ, తా
  17. బిలేశ - తీ; విలేశ - మ, తి; వివేశ - హ, ర
  18. వసతి - తీ