Jump to content

పుట:వదరుబోతు.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

57

కులరూప వయోవిద్యలచే నొప్పియున్నంగూడ నా నోటికి వెఱచి యెవ్వరును కన్య నిచ్చి పుణ్యము గట్టుకొనరైరి. ఈముష్టి యేమని, సత్యరాజాచా- ర్యుఁడు పోయిన మార్గమున స్త్రీ మళయాళమున కరిగితిని. అచటి నాపనులన్నియునుఁ జెప్పుచుండ నాకీది యదనుగాదు. కాని కొన్ని నాళ్ళలోనే నే నచట ప్రఖ్యాతిగాంచితిని. ఒకతూరి స్వయంవర విధిని గురించియు వివాహావశ్యకతఁ గూర్చియు నొక్క బిగిగా మూఁడుదినము లుపన్యసించు సంత- లో నచట కన్యలును, ప్రౌఢలును, అవ్వలును సభఁ జేసి యండఱు నొక్కమారుగా నన్నే పరి ణయనూడ నిశ్చయించుకొనిరఁట!. ఈమహిషీ సహస్రము నేలనోడి యా రాత్రియే తప్పించుకొని బ్రతికితినో భగవంతుఁడా యని యీ దేశమునకు వచ్చి యిఁక నెన్నఁడును వివాహము మాట యెత్త సని నిర్ధారించుకొంటిని.

కాని, రామేశ్వరమునకుఁ బోయినను శనై శ్చరుడు వదలలేదన్నట్లు, ఆకామినులలో గొందఱు నాయడుగుల జాడనంటి యీ దేశమున కరుదెంచి నన్ను వేటాడుచున్నారు. వారి బారికిఁ జిక్క కుండుటకై నాఁటినుండి నే నీయజ్ఞాత వాసమున నుండవలసివచ్చినది. నా యుపన్యాసము లన్నియు