Jump to content

పుట:వదరుబోతు.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

58

మూలఁబడినవి. నావాగ్ధోరణి చల్లారినది. కాని స్వభావము వదలలేక యీ లేఖల రూపమున నించుక వదరుచు నాయాత్మ తృప్తిఁగాంచు కొను చున్నాఁడను.

నేటికింత చాలును. మదీయములగు నితర విషయములఁ గూర్చి మఱియొక తూరి విన్నవించు కొనియెద.

__________


సుఖ స్వరూపం

10

సుఖాపేక్ష మానవులకుఁ గడవరానిది. అనుదినమును విసుగు విరామములు లేక మన యాచరించు పనులును, ఏడు ప్రయాసములును, అనుభవించు కష్టములును, సుఖాపేక్షం బట్టియే!

ఆత్మరక్షణాసక్తియే జంతు జాలమునకుఁ బకృతి సిద్ధమైన ప్రథమోద్దేశమని కొందఱూహింతురు. కాని, యది యంతగా నన్ని వేళలయందును నిజముగా నేరదు. సౌఖ్యనాశము ప్రాణములపై కూడ నిరపేక్షక జనింపఁ జేయు చుండుట మనము గాంచుచున్నారము. దయితా వియోగమునఁ బ్రాణములకుఁ దెగించు పురుషులును,