Jump to content

పుట:వదరుబోతు.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

56

దివురుట నా కెక్కువ యభిమతము. ఒకనాడు వసుచరిత్ర పాఠముఁ జదువుచు,

"కంజనయ నావిలోచన!
   ఖంజనయుగ మెదకు వ్రాలఁగని వసు వాలో
   రంజిలుటఁ దెలిసి,.............."

యనుపద్యమున, కాటుకపిట్టల జంట వ్రా- లినచోట ధనముండునని భూగర్భశాస్త్ర రహస్య మిమిడ్చియుంటఁజూచి యందలి తత్వమరయఁ గోరి యప్పటికి పుస్తకముమూసి యరణ్యముల నంటి, కాటుకపిట్టల దాంపత్యమును వెదకుచు, మూఁడుమాసములు తిరిగితిని. తుదకొకనాఁడు నా కోరిక సఫలముకాఁగా నాచుట్టుప్రక్కల భూభా- గము-రమారమి, నాలు గెకరములు పట్టు- త్రవ్వించు నంతలో తళతళలాడుచు నొకరూక లభించినది. మహధానందమున “రామభూషణకవీ ధన్యుండవీ నన్నిఁటన్ ” అనుకొనుచు నూరుసేరి యొక గొప్ప వ్యాసము వాసి ప్రకటించితిని. నాటినుండి యనేక స్థలముల ననేకోపన్యాసము లీవలసిన చ్చెను. నా వ్యాసము లన్నియు, 'అముద్రిత గ్రంథపయోనిధి' లోఁ జూడఁదగు.

యుక్త వయస్సున నాకుఁ జరిణయ మొన రింపనెంచి నాజనకుఁడెంతో ప్రయత్నించెఁగాని