Jump to content

పుట:వదరుబోతు.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

55

నేను గర్భమున నున్న తఱి మాజనని దుర్ని రీక్ష్య ప్రభాభాసమానమై యద్వితీయవాగాటోప భీకరమై యుండెనఁట. ఆమె కప్పటి చిట్టములలోఁ బలుకుపండును బదరుకాయయును మాత్రమే రుచి కరములుగా నుండేనందురు. నేజనించిన నాఁటి రాత్రి నాజనకుని స్వప్నమున నొక సిద్ధుఁడు త్కరించి, నాకు వదరుబోతని నామకరణమొన రింప నానతిచ్చెనఁట. పెరిగి పెద్దయైనమీఁద నేఁ గొన్ని యద్భుత కార్యములఁ జేయగలనని యా మహాత్ముఁడనినట్లు మానాయన యపుడపుడు చె- ప్పుచుండునుగాని, నాకు విశ్వాసమున్నను లేకున్నను వానిఁ బ్రచురింప నాకిష్టము లేదు.

పసితనమందు సవయస్కుల గుమిగూర్చి వారి కేదేనియొక యంశము బోధించుచుంటినని మాయమ్మ చెప్పుకొనుచుండును. నాజననీజనకులే నాకు విద్యాభ్యాసముఁ గావించిరి. శాస్త్రకావ్యా దుల జనకునినుండియు ఉపన్యాస పద్ధతిని జనని నుండియు గ్రహించితిని. మోమోటములేక పరుల తప్పొప్పుల వారిసముఖముననే వెల్లడించుటయు, తలకువచ్చినను తథ్యమునే ఘంటా ఘోషముగాఁ బల్కుటయును జిన్న నాటినుండి నాయాదర్శములు. ఎంతటికష్టమైన వెనుకంజ వేయక తత్త్వమెఱుఁగఁ