Jump to content

పుట:వదరుబోతు.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

54

దురు. మునుపు సీతం గోల్పోయి యా ప్రాంతమునఁ దిరుగునాఁడొక కపి తన్నుస్తుతింపగా శ్రీరామ చంద్రుఁడు మెచ్చి యచటనివసించు వారండఱును మహావక్తలు కవులు నౌదురుగాత యని వరమిచ్చె నఁట! విజయనగరమున కరుగుచు నొకరాత్రి మా యూర నిద్రింపఁగలిగిన కారణముననే యల్లసాని పెద్దన యాంధ్రకవితాపితామహుఁడయ్యె నందురు. మనపాలిఁటి కివియన్నియుఁ బుక్కిటి పురాణములే, కాని యచట వాగ్మికానివాఁడు లేదు; కవికాని వాఁడరుదు. ఆయూరం జనించిన గ్రంథములసంఖ్య యింతయన నాతరముగాదు అచటి విదుషీమణులు రచించిన భారత భాగవత కావ్యములు చేట గంపలలోఁగూడఁ గానవచ్చును. పుస్తక రాశిలో సద్గ్రంధములు నేఱి యితరముల నచటి యవ్వలు వంట చెఱకుల కుపయోగింతురు. పోనిండు.

రాజస్థానములలోఁ బాండిత్యముచే నార్జిం చిన భూస్థితులును, అగ్రహారవృత్తులును, మావంశ మునకుఁ బెక్కులుగలవు. వానివలన వర్షమునకు వచ్చు మూడుముక్కాలు వరహాల యాదాయ ముచే నాజనకుఁడు దానధర్మాదులఁ జేయుచు శిష్యకోటి కొలువ మహా మహోపాధ్యాయ బిరుద మున సుఖముండును.