Jump to content

పుట:వదరుబోతు.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

53


పాధ్యాయుల పీఠికను సంపాదించియో,రాయ బహదూరులచేతి యోగ్యతాపత్రికలను ముఖమున కతికించుకొనియో బయటఁగాన వచ్చుచుంటిని. మఱుఁగున నుండియే నాయనుభవములను, నా భావములను, నానిశ్చయములను హితార్థమై లోక మున కెఱిఁగించుటే నాసంకల్పము గాకున్నఁ. దొల్తనే నావ్రాతలు నవరసభరితములని, జాతీ- యాభ్యుదయ సంధాయకములని, అజ్ఞానతిమిర సూర్యోదయములని డబ్బిచ్చియైనఁ బతికలలోఁ బ్రకటించుకొనుచుంటిని. కాని నాయఙ్ఞాతవాస మనేకులకు రుచింప లేదగుటఁజేసి విధిలేక యిపుడు వృత్తాంత మొక్కింత వ్రాయవలసెను.

నేనొక్క త్రిదశుఁడను. విద్యాధర వంశ- జుఁడను. నాపూర్వులు హిమాలయ ప్రాంత దేశ విహారములు విడనాడి యిట్ల కరుదేరఁ గారణము లనేకములు సెప్పుదురుగాని వాని వివరములతోఁ జదువరుల నలయింపఁదలఁపలేదు. నాజన్మస్థానము వాఁగులేటి తీరమున, ప్రేలుకొండ చేరువనున్న గయ్యాళిపల్లియ. గట్టివాయి రాయఁడను విభు ధోత్తముఁడు నాతండ్రి! నాతల్లిని ఱాగమ్మ యం- దురు. మాయది గొప్ప పండితకవి వంశమని ప్రతీతి. ఆయూరి యవ్వలు కారణమునిట్లు చెప్పు .