Jump to content

పుట:వదరుబోతు.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

52

డుట నాక కాదు పలువురకు రుచింపకున్నది. గ్రంథము విమర్శింపక మున్న గంధకర్త చరిత్రము. నెఱుఁగుటకై పాఠకలోకము కుతూహలపడుట యస్వాభావికముగాదు. కాక, యీయీ యజ్ఞాత వాసమునకుఁ గారణము, గూడ మాకు దురూ- హ్యము. ఈలోపము తొలగించితి లేని మీ లేఖలు మిగుల ప్రశ స్తిగాంచఁ గలవని,

విన్నవించు విధేయుఁడు,

అగస్త్య భ్రాత.

నిజమే! ఈ కాలమున గ్రంథముచేతఁ జిక్కి నంత గ్రంధకర్తయెవఁడో యేసీమవాఁడో, బా- లుడో, వృద్ధుఁడో, రూపసియో కురూపియో, వైదికుఁడో, నియోగియో, ఛాందసుడో, పట్టపరీక్షా సిద్ధుఁడో, మున్నగు విషయములఁ - గమనించుటే చదువరుల మొదటిపని, తరువాత గ్రంథకర్త లబ్ధప్రతిష్ఠుఁడుగానిచో గొప్పవారిచేతి పీఠికమైన యొక యోగ్యతాపత్రికయైన కంటబడనినాఁడు గ్రంథమెట్టిదైనను నిస్సారమే.

గ్రంథకగృత్వకీర్తి నాసించియున్నచో "నేనును దగురీతి నాశక్తిని భూతదర్పణమునఁ బ్రతిఫలింపఁ జేసి భేరీభాంకారములతో సాటించి, చాలమికి జమీందారుని కంకితమిచ్చియో, మహామహో