Jump to content

పుట:వదరుబోతు.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

41

కను జయించి మరల విమానమున సీతాదేవితోడ సయోధ్యఁ జేరవచ్చుచుండెను. అతని యాగమన మును తొలుతనే హనుమంతుని మూలమున విని, యంతకుమున్ను తాము పలుమాఱు వినియున్న సీతాసౌందర్యమును బరీక్షించుటకై తార, రుమ మొదలగు వానర నాయికలు కుతూహలమున మాల్యవంతపు శిఖరముపై వేచియుండిరి. వానర సేనతోడ సీతారాములును వచ్చిరి. కుశలప్రశ్నాది సమయమున సీత నాపాదమస్తకము సూక్ష్మదృ- ష్టితోఁ బరీక్షించి తార, తుదకు 'అయ్యోపాపము' అని వగచెను. తక్కిన చెలికత్తియలు కారణ మడుగఁగా "చూచితిరా! దేహము బంగారువన్నె; కన్నులు విశాలములు; ఎత్తయిన నాసిక; రోమ రహితములైన యంగములు! ఆ సౌందర్యవతిఁ బడయుటకు భర్త యెంతో పుణ్యము చేసియుండ వలయును. నిజమే, కాని సీతకు మనవలె కుఱు- చగనో గొప్పగనో తోఁకయొకటి యున్న నెంత బాగుగా నుండియుండును! అన్ని లక్షణములును ఒకచో నుండవుగదా! యని పలికెనఁట!

ప్రకృతము "మేము సంపాదించుకొన్న యవ వాదము నిట్టిదే. వదరుఁబోతు ప్రకాశమునకు వచ్చుటకేది యుద్దేశమో దానికిని హాస్యమునకును,