Jump to content

పుట:వదరుబోతు.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

40


యిప్పటి సదాచారము. పుట్టిన తరువాత గిట్టు లోపలఁ గొందఱభినందించినను మఱికొందఱిచేనైన నపవాదపడక తప్పదు. మా 'వదరుఁబోతు' ఇప్పుడే పుట్టియున్నను ఇంతలోనే దానికి నపవాద మొకటి రాక తప్పినదిగాదు అదియు సందు గొం- దులలో వినఁబడునదే యైనను, మేము మహా పురుషులముగాము గావున దానిని సరుకుచేయుట యొక యవలక్షణము గాదనుకొనెదము.

అపవాదము రెండు దెఱఁగులు, మిథ్యాప వాడము సత్యాపవాదమునని. అందు (1) ఉన్న దానిని లేదనుట (2) లేనిదాని నున్నదనుట యని మొదటిది ద్వివిధము. (1) ఉన్న దాని నున్నదనుట (2) లేనిదానిని లేదనుటయని రెండవదియు రెండు దెఱఁగులు. ఉదారహృదయులగు మాచదువరులు ద్వివిధమిథ్యాప వాదములనుగాని మొదటి సత్యాప వాడమునుగాని మాపై మోపలేదు. లేనిదానినే లేదన్నారు. అదియుఁబూర్తిగ లేనిదిగాదు. లేని దానివలెఁ గానవచ్చునది. 'వదరుఁబోతు సర్వ విధములఁ జక్కఁగ నున్నదిగాని యొకటిమాత్రము · తక్కున' అదేమనఁగా 'హాస్యము'!

ఒకకథ యీసందర్భమున స్మరణకు వచ్చు చున్నది. త్రేతాయుగమున రామచంద్రుఁడు లం -