Jump to content

పుట:వదరుబోతు.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

39

            పక్కకుతానై వచ్చీని,
ఆ చుక్క నీయెదకుఁ జిక్కినంత బుడు
        బుక్కుల తిమ్ముఁడు నవ్వీని”

విద్యాప్రియుని యానందము పార మెఱుం గదు. అతఁడు "సెబాసు”ల వర్షించుచు నీధార- ముగిసినంతఁ దనపై నున్న 'శల్లా' నట్టె వారిపైఁ బారవైచి, యొక పత్రికలో నీబిరుదముల వ్రాసి బహుమతిచేసెను.

“బక్కటెద్దు భయంకర గంగిరెద్దులు, గ్రుక్కు త్రిప్పని గురులింగలు, వచనకవి చౌడప్పలు, గా మసింహులు, సరస్వతి మేనమామలు.”



హాస్యకళ

సందు గొందులలో వినఁబడు నపవాద ములను సరకుసేయక మరల వీధులలో నెప్పటియట్లే. మీసాలు దువ్వుచుండుట నేఁటి మహాపురుషుల లక్షణము. మొగమెదురుగ నీయం దీలోపమున్న దని వచించునంతటి దుర్ముఖులును, నేఁడరుదు. ఎదుటఁ బొగడుట, మఱుఁగున నేదో యున్న దానినో లేనిదానినో యూఁతఁ జేసికొని తెగడుట.