Jump to content

పుట:వదరుబోతు.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38

గద్యపద్యరూపముగ గ్రుక్కతిప్పక చెరి యొక పాదముఁ జెప్పుచునతనిపై కవనము గ్రుమ్మరించిరి . ఆ జంటకవుల ధోరణికి నే నద్భుత పడితిని. రావు గార ట్టే నోఱు తెరచుకొని వినసాగిరి.నా యా శు కవితలోఁ కొన్ని పంక్తులు మాత్రము నా స్ఫురణలో నున్నవి.

"ఆదివారమే బుడుబుడుకా
          అమృతపుపలుకే పలికీని
  ......................
          
ఒక్కమాటనే నిక్కడ చెప్పెద
           నిక్కముగానది నడచీని
ఈ దిక్కులోననొక చక్కని చిన్నది
            నిక్కి నిక్కి నినుజూచీని
ఆ-యక్క సోయగము టక్కు గాదు మీ
            చుక్కలరాయఁడు మెచ్చీని
బల్-ఱెక్కలుగలిగిన మక్కువతో నా
            దిక్కు నీమనసు తిరిగీని
ఆ-సక్కెరబొమ్మను పెక్కు లేలయీ
           వక్క లాకులే `తెచ్చీని
ఈ-వక్కాకామెకు నిక్కముగా మది
           తిక్కతనము నెత్తించీని
వేరొక్కటిచూడక తిక్క ముదిరి సీ