Jump to content

పుట:వదరుబోతు.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

37

8. చతుర్వాణీ భుజంగ, సాహిత్య పతంగ,
   వేణీనాథకవి;
   (వీరికరవ మింటిభాష; హిందూస్థానీ కన్న
    డము లించుకవచ్చును; తెలుఁగు నీవలనేర్చిరి;
    ఏఁడాది నుండి కవన మారంభమయినది.)
9. అవధాని రావణాసుర, తర్కతీర్థ, అక్బర్
   జహాంగీరు కవులు;
10. కవితాహంకార చక్రవర్తి, వాగ్దేవీ భ-
    యంకర, తిట్టుకవిభూషణ, ఘటికాశతాక్షర
    గ్రంథకరణనిపుణ, మిధున కవులు.
ఇంక, ఆంధ్రపాణిన్యాచార్య, నిమిష కవి
శిరోమణి ప్రముఖులు పెక్కండ్రుగలరు.

ఇచ్చటికి గ్రంథ పరీక్ష యయినది. నాయభి ప్రాయ మొక్కటె కొదవ!

ఇంతలో విద్యాప్రియరావు (ఇదియు బిరు' దమే!) నాగదినలంకరించి, యీ గ్రంథము నంది కొని కటాక్షించి కవన ధోరణి మెచ్చుకొని తల యూఁచెను. కవులకుఁ గాసిచ్చి యెఱుఁగకున్నను బిరుదదానములో నితఁ డభినవకర్ణుఁడు. మే మీ విషయమును గూర్చియే ప్రసంగించు చుండునంత, యిరువురు బుడుబుకుక్కలవారు వచ్చి వాఁకట నిలిచి పినాకినీ ప్రవాహముఁబోలు నాశుధారతో.