Jump to content

పుట:వదరుబోతు.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

36

నొందిన యీవృద్ధసరస్వతిగారి కృతికిఁబీఠిక వ్రాయ గల్గుట నాయదృష్టమే!” అని యేమేమో రామాయణమంత యున్నది. కడకొక బి. ఎ. గారి వ్రాలు గలదు.

గ్రంథము సగము చదివిన ట్లే! కానిమ్మని యభిప్రాయముల వంక నవలోకించితిని. నూర్ల కొలది యభిప్రాయదాతలు గలరు. కొందరి నామ ములు మాత్రము వ్రాసెదను.

1. ఆంధ్రశుక్రాచార్య, అభినవాంధ్ర స్కాటు
     వీర భద్రకవి
2. ఆంధ్రనాటక వృద్ధప్రపితామహ, అభినవ.
     షేక్ స్పియరు రమాకాంతరావు;
' ఆంధ్రనాటక పితామహ' బిరుదు మీవఱకే
     'ఖర్చు ' పడిపోవుటఁజేసి వీరికీ వృద్ధత్వము,
3. వచన వాచస్పతి, రామానుజరావునాయఁడు;
4. చారిత్య్రమాతామహ, సాంబకవి;
5. నవలామన్మథ, శిశుకవి పోతిరెడ్డి;
     (వీరు దినమున కొక నవల వ్రాయఁగలరఁట!)
6. గద్యభాస్కర, కవిబ్రహ్మ, మహేశ్వరకవి;
7. శ్రీమాన్ , విద్వాన్, అపశబ్ద శిరోమణి
     రసగంగాధర, వ్యాకరణ కుఠార, దొడ్డప్పా
     చార్యుడు;