Jump to content

పుట:వదరుబోతు.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

42

సౌందర్యమునకును తోఁకకునుగలయంత దూరము లేకున్నను, గొంతమైన దూరముగలదు. చర్చింపఁ దగ్గినవానిని చర్చించుట, ఖండింపఁదగిన వానిని ఖండించుట, పొగడఁదగువానిని బొగడుట, తన్మూ- లమున విషయములఁ గూర్చి మాయొక్కయు సా- మాన్యులకు చదువరులయొక్కయు భావనాపథ మును విశాలముగా నొనర్చుట, ఇత్యాదులు మా యుద్దేశములు. ఇవి మా ప్రయత్నములని వచిం- చెదముగాని ఫలములని వచింపము. మాపత్రిక నందుకొని నెమ్మదిగా నిదానముగా చదువుకొని 'ఫరవాలేదు' అని యభినందించుట మాకుఁజాలు- ను; కాని రాకమునుపే యెదురుచూచుచుండి వచ్చిన తోడనే గడ గడమని కార్యకారణ భావ ములను గమనింపక యొక్క గ్రుక్కగాఁ జదువు కొని పక్కుమని పదిమాఱులు నవ్వి, తరువాత నదేకాగితమునే మేజాపైని మైలఁ దుడుచుట కుప యోగించువారి కొఱకు మా ప్రయత్నముగాదు. అనఁగా హాస్యరసమునే సంపూర్ణముగ వదలుట మాయుద్దేశముగాదు. ఒకరిని నవ్వింపఁ బయ- త్నించుట మనుష్యజాతి సహజములగు లక్షణ ములలో నొకటి. కావున దానిని మేమును వదలలేము. మఱియుఁ గొంత దుర్గ్రహమైన