Jump to content

పుట:వదరుబోతు.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

33

నొక్క యల్లసాని పెద్దనకు మాత్ర మేగ్రహ బలముననో యొక బిరుదము వచ్చెను. మహా కవులగు వ్యాస వాల్మీకి పాణిని కణాద కాళిదాస భవభూతి హర్షాదుల కొక్కొకబిరుద మేని లభింపఁ లేదు. ఇంక నేటి స్థితిఁ బరికించితిమా, శనిచాలని మే ముగ్గురునల్వురోతక్క పేరునకు ముందో వెనుకనో యొకటి రెండయిన బిరుదవాక్యముల నంటించుకొనని వ్రాయసగాఁడే యరుదు. కవియే యసంభవము; గ్రంథకర్తయే లేఁడు.

ఆశుకవులు, బాలకవులు, కవిరాజులు, శతావధానులు, మనకు సులభముగ నర్థమగుదురు. ' కాని యీకాలపు బిరుడము లింతటితో ముగియు నవి కావు. ఆవాక్యములసృష్టి యొక విచిత్రపు పద్ధతి. ఈబిరుదములకై సరస్వతి బాల్య కౌమార యౌవన వార్ధకములలో, క్షణమొక యవస్థతోఁ దన్నుకొనుచు గిజగిజ లాడుచున్నది; సంస్కృత కవులు పాప మేయేదేశమువారో యాంధ్రులై యవతార మెత్తవలసిరి; ప్రాచీనులు గూడ 'నభినవ' జన్మకష్టముల ననుభవించిరి; చాలదని యాంగ్ల దేశపు కవులును, నాటకకర్తలును దెలుఁగువారై యిందుఁ బుట్టసాగిరి; ఇవన్నియునుండ సింహ శరభ గండ భేరుండాదులును బిరుదావళి కెక్కవలసి