Jump to content

పుట:వదరుబోతు.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34

పచ్చెను. ఇంక మూషికమార్జాలాదుల వంతు గూడ నింతలో రానున్నదేమో!

ఆంధ్రవ్యాసుఁడింతలో రానున్నాఁడు. అభి- నవతిక్కన యీవరకే యున్నాడు గాఁబోలు. ఆంధ్రపరాశర, ఆంధ్రగౌతమ, ఆంధ్రబ్రహ్మలును సిద్ధముగ నున్నారు. షేక్స్పియరు స్కాట్టులు చేసిన పుణ్యమేమి మా పాపమేమి, యని గోల్డు స్మిత్తు, మెకాలే, మాక్సుముల్లర్లు కోపగించు కొన్నారనుకొందును. అభినవదండి బిరుదము కేతన యపహరింపక పోయిన ఇప్పటి కెందరో గ్రుద్దు లాడుకొని యుందురు. ఆంధ్రకాళిదాస బిరుదమును గూర్చి చాలమందికి కేశాకేశి బాహాబాహి యింతలో జరుగునని నాభయము.

ఈకళ యింకయు నాడువారి కంతగా పడలేదు కానీ, యున్నచో, నీవఱకే యభినవ కుమ్మర మొల్ల, నవీనముద్దుపళని, ఆంధ్రబిసాంటుగా ర్లవతరించియే యుందురని నానమ్మకము. మగ వారు కొల్లలుగ బిరుదములు ధరించియుండ వారు మాత్ర మూరకుందురా? వారికి మాత్రము తగిన శక్తి లేదా?

కొన్నాళ్ళవెనుక నొకశాస్త్రిగారి 'కాంధ్ర బృహస్పతి' యను బిరుదువచ్చెను. వారు పూర్ణ