Jump to content

పుట:వదరుబోతు.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32

చూచుటకన్న నగుబాటుకలదా? ఇట్టి జ్ఞానము కన్న మౌఢ్యము హృదయంగము కాదని యే వివేక శాలి యనఁగలడు? "Little knowledge is dangerous."



బిరుదయుగము

6

ఇరువదవ శతాబ్దము నెవరే యుగమన్నను నామతమున నది బిరుదయుగము. తలతోఁక లేని బిరుదములఁ గోట్ల కొలఁదిగి ననుదినమును వార్తాపత్రికలలో నిప్పుడు వినుచున్నారము. అం- దును నౌదార్యమున కాటపట్టయిన మన యాంధ్ర దేశమున నవి కాసునకు గంపెడు! కాగితములు కరవై గడియ యొక గండముగ నున్న యిప్పుడు సయితము దేశ పత్రిక లెడప దడప తీఱిక కల్పించు కొని నెమ్మదిగా రెండు పుటలయిన నీ స్తృతిపాఠక లేఖకుల వ్రాఁతలకుఁ జోటియ్యవలసియే యున్నది. ఇతర విషయము లటుండ కవితా విషయమున నీ యాచారమునకు మట్టు మర్యాదలే లేవు. పదు నాఱవ శతాబ్దమునఁ గృష్ణదేవరాయని 'భువన విజయ' మహాసభలోని యష్టదిగ్గజములలో నెల్ల