Jump to content

పుట:వదరుబోతు.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

31

గడ కతిసారరోగము నంటఁగట్టును. అగ్ని మాం- ద్యమున నారేండ్లు బ్రదుకఁగలవాఁ డతిసారమున మకరసంక్రమణమున కెదుఱు సూచుచుండును. అల్పవిద్యయు మోటుఁదనము నించుక తఱచి విడుచుటచే బుద్ధి కొక్కింత యుత్తేజనము గలిగి చిక్కినది కబళింప నాసవొడమును; కాని యర- గించుకొను శక్తి యుండమి నవివేకము ముదిరి మనుజుఁడు రెంటికిం జెడిన రేవణయగును. “చదువ వేయ నున్న మతియుఁబోయె” ననులోకోక్తి యిట్టి చదువునుఁ గూర్చియే!

మన పాఠశాలలలో బాలు రిట్టివిద్యనే క్రయమునకుఁ గొనుచున్నారు. పూర్ణ పాండిత్య మీ కాలమున ననేకుల కందరాని పండు; కాననే హంస కాకున్న మానె, కాకియుఁ గాని దుస్థితి సమకూరినది. ఇంతియ కాదు. ఎవరేమి చెప్పిన నేమియను సహనముండదు. తమంత విషయము నిర్దరించుకొను శక్తిలేదు. నిజ మరయగోరి పాటు పడ నోపిక రాదు; ఇతరుల యుపదేశమర్దము కాదు; మూఢభక్తికి నేర్చిన చదువు చోటియ్యదు; నల్గురిలో మాటాడకున్న నభిమానము విడువదు. పరిణామమిదియ. ఇట్టి విద్యానంతు లితరుు హీనపు చూపు