Jump to content

పుట:వదరుబోతు.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

30


తోడివారింగూడఁ జెఱచును. మోటువారి రాక్షస కృత్యములచే నొకరిద్దరు మరణింపవచ్చును గాని, కోట్లకొలఁది నిరపరాధులు యుద్ధరంగమున నకాలమరణము పాలుగారు. సామాన్య ధర్మ ములలో రుచిలేక విశేష ధర్మము లెఱుఁగక యందు నిందుఁ గొఱగాని యవివేకులగు చదివినవారికన్న నపండితుఁడే మేలని ప్రపంచతత్త్వవేత్తల మతము. అగుటం బట్టియే,

చదివినతనికన్న చాకలిమేలురా!
విశ్వదాభిరామ వినరవేమ!॥

యను వేమన బంగారంపుఁ బలుకులు!

చదువు మంచిదే యని యొప్పుకొన్నను మనవారు దానినభ్యసించు విధమైన నీయనర్థమున కెల్లమూలమనక తప్పదు. మోటుదన మగ్ని మాంద్యమువంటిది. ఆ రోగముగలవాడు మితా- హరమునఁ గాలముఁ గడుపవచ్చును. మందు కలదుకాని నియమిత కాలము దాక యపథ్య దోషము లేకుండ సాధించినచో నది యారోగ్య మును తప్పక ప్రసాదించును. అటుగాక కొన్నా- ళ్ళుమాత్రము సేవించి యనాదరము చూపినచో నాఁకలిహెచ్చి తిండి కారాట మధికరుగును; గాని జీర్ణశక్తి పూర్ణముగ రానికారణమునఁ