Jump to content

పుట:వదరుబోతు.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

19

యోగ్యతఁ జూపకమున్న, తమంత నితరులకు గౌరవమును గొల్లలుగ దానము సేయు మహాదాత లీపుడు గలరు.ఈదానమునఁ దమగౌరవమునకు హాని వాటిల్లునదిగూడ వీరు సరకు చేయని యుదా మునుపటివలె గాక యిప్పుడు బజారున "గౌరవము” వెలకుఁగూడ లభించును. ధనవంతు లెల్లరును స్వేచ్ఛగఁ దానిఁ గొని యనుభవింతురు. ఇంతియకాదు. దాతల నాశ్రయింపఁ జాలని వారును, పణమిచ్చి కొన శక్తిలేనివారును గూడ దీని నార్జించుట కుపాయము లేకపోలేదు. నలు- గురు పోవుత్రోవను బోక నూతనమార్గ మొకటి దీని యందరుగుచు నదియే సత్పథమని యుచ్చై- స్వరమునఁ జూటుచుం బోవుచున్నచోఁ జాలును. ఆమార్గమున రాసులుగ నుండు గౌరవమును జేత నయినంతపట్టి మూటగట్టుకొని యరుగవచ్చును.

కాని యొకటి మాత్రము చింతాకరము. నేఁటి. “బాలసరస్వతి”ని రేపు ప్రశంసించు వా రకుదు. నిన్నఁటి 'రాయబహదూరు”ను నేఁడు తలంచువారు లేరు. మొన్నటి గ్రంథమును, కవిని, ఎల్లుండి స్మరించువా రుండరు. “ఆంధ్రకవితా పితామహ” బిరుదముచే నల్లసాని పెద్దనార్యుఁ డెన్ని యేండ్లకయిన గుర్తింపఁబడఁడా?.