Jump to content

పుట:వదరుబోతు.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

20

శిబి కర్ణ జీమూతవాహనుల పవిత్రనామాక్షరము లెన్ని యుగములకైన మాయునా? ముద్రా యంత్రములు పనిబూనిన తరువాతనే వాల్మీకి రామాయణమును రచించెనా? యోగ్యత ననుస- రించి గౌరవము తనంత రావలయుఁగాని, కొలఁదికి మీరి యపేక్షించి నంత రాదనుట ధ్రువము.

Fair Nymph, if fame or honour were to be
atinined with ease
Then would I come and rest with thee and
leave such toils as these.
                             -DANIEL.


తీరికలేమి

4   

గతరాత్రి సాంఘిక విషయము నొకదానిం గూర్చి వితర్కించుకొనుచుఁ బెద్దయుంబ్రొద్దు నిద్ర మేల్కొనియుండిన కతంబున నేఁటి యుదయమున నాకొక్కింత జబ్బు చేసినది. 'ఇంచుక 'కాఫీ' కషాయము సేవింతమని "యానందభవన ” మున కరిగి యొకచోఁ గూర్చుండి 'కాఫీ' నార్చుకొనుచుఁ జుట్టునుం జూచితిని. కొందఱు త్రాగుచుండిరి; .