Jump to content

పుట:వదరుబోతు.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18

కాని పూర్వకాలమున నిట్లుకాదు. రాజర్షి సత్తముఁడై యపరచతుర్ముఖుఁ డనందగిన మహా తపోనిధి విశ్వామిత్రుఁడు బ్రహ్మర్షిత్వము వడయు టకై యెంతకాల మెన్ని పడబాట్లు పడియెనో మనము విననిదికాదు.రాక్షసరాజుచే నపహ రింపఁ బడుచున్న లోకమాత సీతకై తనప్రాణ- ముల గోలుపోయిన జటాయువును నిర్దేశించి స్మరణచిహ్నము నొకదానినైన నెవ్వఁడును నెల కొల్పలేదు. భగీరథుఁడు గంగను దెచ్చిన చోట ప్రశంసా సూచకముగ నొక్క శాసనాక్షరమైనఁ గలదా తన కహితమైనఁ గానిమ్మని సహజ కవచ కుండలముల నడిగినంత దానమిచ్చిన యా వ దాన్య శిరోరత్నమగు కర్ణునికి కడకొక "రాయ బహదూరీ” నిచ్చిన పుణ్యాత్ములనైనఁ జూపుఁడు. కాళిదాసునివంటి మహాకవికే రాజసభలో ప్రవే శము చాలకాలమునకుఁగాని కల్గినది కాదఁట.

ఇందలి తారతమ్యమిది. తొల్లి గౌరవము నాశించువా రెంత యుదారులుగ నుండిరో, గౌర- వించువారుఁగూడ సంత లోభులుగనుండిరి. ఇప్పుడీ భేశము తారుమారైనది. గౌరవమునకై లోభ- పడువారు హెచ్చినకొలఁది గౌరవము నిచ్చువారు ప్రబలిరి. అడుగకమున్న, ప్రయత్నింపకమున్న,