Jump to content

పుట:వదరుబోతు.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

17

వెఱఁగు పడజేసిన యేకలవ్యుఁడు తనయడవులలోఁ దాను తిరుగుచుండెఁగాని యూరూరు దిరిగి తన శక్తిని జనులకు వెల్లడించుచు “సభినవద్రోణా- చార్యు”డని పొగడొండ యత్నించిన వాడు కాఁడు. ఇంక నేఁటి పత్రికలలోఁ జూడుఁడు; యోగు- లకును, దేశోద్ధారకులకును, వైద్యులకును, దాత- లకును, కవులకును, గ్రంథములకును మితీయే కాన రాదు. వారి వర్ణన అపారములు. నేను ముందు నేను ముందని గౌరవమునకై ప్రతిమనుజుఁడును ప్రయత్నించు చుండుట యీ కాలపు లక్షణము.

ఘటం భింద్యాత్ పటం ఛింద్యాత్
      కుర్వాద్వా గార్ధభస్వనం!
ఏన కేనా ప్యుపాయేన
      ప్రసిద్ధః పురుషో భవేత్ ||

ఇది నేఁటి ధర్మము. కాని మరియొక విశేషము గలదు. ఇప్పుడు లభించినంత సులభముగఁ బూర్వకాలమున గౌర- వము లభించునదికాదు. ఇప్పుడు కందమువ్రాసిన వారెల్లఁగవులే! మందునూరిన వారెల్ల వైద్యులే! గడ్డము పెంచినంత మహర్షిగావచ్చును. ఉపన్యా- సవేదిక నెక్కినంత నాయక పదవి నధిష్ఠింపవచ్చును.