Jump to content

పుట:వదరుబోతు.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16

నానావిధ ఫలాదుల మఱుఁగున యథేష్టముగ భుజింపగోరి కపటయోగమును సలుపు చుండలేదు. దేశోద్ధారకుఁడను కీర్తి గడింపఁ బనిఁ బూనిఁ యుప న్యాసము లిచ్చుచుండ లేదు. వారి పద్దతి వేఱు. ధన్వంతరి యైనను దనమందు లమూల్యములని, అసాధారణములని, సిద్ధక్రియలని, పత్రికలలోఁ ప్రచురించినట్లు కానము. వశిష్ఠాది మహామునులు శిష్యకోటితో సనుసరింపఁ బడుచుండిరిగాని “పర- మహంస పరివ్రాజకాచార్య, ప్రతివాది భయంకర ప్రముఖ బిరుదములతో వారు తమ్ము బొగడు చుండగాఁ దృప్తితో నాలకించుచుండినట్లు వినము. పరోపకారార్థమై తమ దేహమునేని యాసింపని శిబిచక్రవర్తియు జీమూత వాహనుఁడును దమ స్వార్థత్యాగమును మునుముందుగఁ జాటించిన వారు కారు. మహాకవు లనేకులు నూర్లకొలఁదిగ నుద్గ్రంథములు రచించిరికాని “గ్రంథమాలల” స్థాపించినవారులేరు. “జగద్ధితంబుగా” సుప్రసిద్ధ మగు భాగవత పురాణమును రచించిన బమ్మెర పోతన "హాలికుఁడు"గ కాలము గడపెఁగాని "భాగవత గ్రంథకర్తా”యని తాటికాయ లంతేసి ప్రకటనాక్షరములఁ దనయింటి వాకిటిపైఁ జెక్కించి యుండడు. విలువిద్యలో నర్జునుని సయితము