Jump to content

పుట:వదరుబోతు.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

15

తగ్గియుండదు. రామరాజ్యము నాఁడును ధర్మరాజు పరిపాలనమందునుగూడ నీ పదార్థమింత యగ్గువ యయినదికాదు. అంత దనుకయేల? ప్రకృతపు ప్రపంచ సంగ్రామము కారణముగ బజారున అన్నిం టికిని వెల లసాధారణముగ హెచ్చుచున్నఁగూడ “గౌరవ"ము మాత్రము. నానాఁటికి చవుకగఁ బరిణమించు చున్నయది.

ఇంతమాత్రం మొక వింతకాదు. ఉపయో గించువారి సంఖ్య మధికమగు కొలఁదిని పదార్థ సంచయపువెల హెచ్చుట మన కనుభవగోచరము. గౌరవపు విషయమున నీవిధి వర్తింపదు. పూర్వ కాలమున గౌరవము నపేక్షించువారు చాల తక్కువ. ఎవ్వడో నూఁటనొక్కఁడు మాత్రము దాని నభిలషించుచుండెను. ఇప్పుడన్ననో, ఆబాల గోపాలముగ నందరును గౌరవమునకై యఱ్ఱులు సాచుచున్నారు. కాని గిరాకి హెచ్చినను వెల హెచ్చలేదను టొకవింతయే!

తొల్లింటివారు పరులు తమ్ము గౌరవించి నను లేకున్నను తమ తమ ధర్మములు నిర్వర్తించి తృప్తిఁజెందుచుండిరి. నిష్టాగరిష్ఠులని పదుగురిలో ఖ్యాతిఁగాంచ నెంచి సంధ్యావందనాదిక మాచ- రించుచుండలేదు. భక్తితోఁ బలువురు సమర్పించు