Jump to content

పుట:వదరుబోతు.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14

ముకాని గ్రంథములఁజదివి రానిపోని స్వర్గసుఖ- మున కర్రులు సాచుటకన్న మనయింట మన యూర, మన దేశమున, మన సంఘమున, మన జీవితముల నుపయుక్తములుగఁ జేయుట మిగుల ముఖ్యమని నాయాశయము.

   చదువులందులేదు శాస్త్రమందును లేదు,
   లేదు వాడదైవ భేదములను
   బయటనున్నముక్తి బాటించలేరయా
   విశ్వదాభిరామ వినరవేమ!
   



గౌరవపదార్థము

3

మునుపటి కాలమునకును మన కాలము నకునుఁగల భేదమును విమర్శించు నొక యర్థ శాస్త్రవేత్త “మునుపటికన్న నిపు డన్నిపదార్థము లకును వెలలు చాల హెచ్చిన" వనియె. నిజమే కాని నాకుఁదోచినంతలో నీమాత్రమున కొక యపవాద మున్నయది. ఎంతటి సుభిక్షు సంవ- త్సరము లందైనను, ఏ సామ్రాజ్యకాలమం దైనను ునుపటి దినములలో "గౌరవమున కొంత వెల