Jump to content

పుట:వదరుబోతు.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

13

ములని జెప్పు ధర్మశాస్త్రములన్నియును సంఘ- మునకు మేలుగలిగించు నుద్దేశము గలవికావా?

సంఘమునకుఁ జెఱుపుఁగలిగించు కార్యము లనేగదా వారు నరకహేతువులగు పాపకార్యము లనుట. మనకుఁ జేతనైనంత మట్టున కితరులకు మేలుచేయుచు, సంఘమున కేవిధమగు కీడుఁగలి గింపక నలుగురిలో సజ్జనుఁడనిపించుకొన్నచో శ్రుతి స్మృతుల యుద్దేశము నెఱవేరును గదా? అట్ల యినచో దేవుఁడుండనిండు, లేకుండనిండు. శంకర మతమైనఁ గానిండు, చార్వాకమన్న నననిండు. స్వర్గములుండనిండు; లేక వలసఁబోనిండు; వాని గూర్చి వృధా కాలక్షేపము లెందుకు?ఈ మన యుద్దేశము నెఱవేరినచో యిహసౌఖ్య మేమో తప్పక కలుగును. పరమున్నచో నిస్సంశయముగా నందును సౌఖ్యమే చేకూరును. లేకున్న నక్కఱ యేలేదు. వృధా కష్టమేల?

ఇట్లని నా మెడకు నాస్తికత్వ మంటఁగట్ట రాదు. స్వర్గసుఖమన్న నాకు మాత్రము నోరూరక పోవునా? ఆలోక మేదిశలోనున్నదో నేనిదివర కెఱుఁగనైతిని గాని లేనిచో నీ వేళకు నలకూబ రునితో ద్వంద్వయుద్ధము నారంభించియే యుందు 'నేమో! పోనిండు; తెలియని మతములకై యర్థ-